*ఉత్పలమాల*
వర్షమురాగజూసియును-
బాగుగ నేర్పుతొ కాంక్ష తోడుతన్
కర్షకులెల్లదుక్కులను-
కంపలుదీసియు దున్నుచుండగన్
హర్షము పొందుచున్ పనులు-
యాతనచెందక చేయుచుండగన్
మర్షము తోడవిత్తులను-
మంచిగ నాటగ పంట పండునే
*తేటగీతిమాలిక*
మనుజు లందరునిప్పుడు మంచిజేసె
పచ్చ చెట్లనునరికెను పరుషముగను
పండ్లు కాయలుదొరకక పక్షిజాతి
నీడకోసమైవెదకగ జాడలేక
అంత రించుచు నుండెను కొంత వరకు
నరుడు గమనించి చెట్లను నాటుచుండ
అడవులన్నియుపెరగగ నవని యంత
పచ్చదనముతో చెట్లన్ని పరవశించ
జీవ జాతులు మరలెను క్షేమముగను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి