*నీటి పొదుపు*:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371


 

*సీసం*
నీరునెపుడునీవు పారబోయవలదు
పొదుపుజేయవలెను పుడమినందు
భూగర్భ జలముల మూలబిందువుయైన
చెరువులకాపాడు చెలిమితోడ
ఇంకుడుగుంతల నింటింటనిర్మించి
పెంచవలెనునీరు మంచిగాను
అవసరమున్నంత యందరువాడగ
ముందుతరాలకు ముప్పులేదు
*ఆటవెలది*
జలముపొదుపుజేసి జగతికిమేలును
చేయగలరుమీరు చెంతయుండి
ప్రతిదినీటిబొట్టు పరమాత్మ పుణ్యమే
విడిచిపెట్టకుండ వొడిసిపట్టు