*ఎల్లమ్మతల్లి వర్ణన*:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట-చరవాణి:9391097371.


  సీసం:
జగములనేలేటి జగదాంబ తల్లిగా
కొలువైన యెల్లమ్మ కోర్కెదీర్చు
గ్రామదేవతగను గ్రామాన్ని రక్షించి
నిలువెత్తురూపంల వెలుగుచుండు
భక్తులుప్రేమతో బంగారుబోనాలు
తీయుచుండునెపుడు తీరికగను
సిద్దోగములుజేసి శివసత్తులాటతో
మొక్కుదీర్చుకొనగ మురిపెముగను
*ఆటవెలది*
ఇంటికి నిలవేల్పె యెల్లమ్మతల్లియు
భక్తులకరుణించి వరములిచ్చు
కోరిజనులు మ్రొక్క కోపగించకతల్లి
రక్ష జేసి గాచు లక్షణముగ