*క్రీడలు*:-బాకి నారాయణహైదరాబాద్- *చరవాణి:9440065312*
ఆట పాటలుర్వి ఆనంద మిచ్చును 
పట్టుదలను పెంచు ప్రజ్ఞ పెరుగు 
విజయపథము నందు విహరించ నేర్పును ఓటమొప్పుకొనెడి ఓర్మి నేర్పు

ఎపుడు యోచనుండు ఎత్తుకు పై ఎత్తు 
వేసి గెలుపు గోరు విడువడెపుడు 
ప్రతిన‌బూను చుండు ప్రత్యర్థి నోడించ
సూక్ష్మ బుద్ధి తోడ సోది చెప్పు

తోటి వారి తోడ దోబూచు లాటుండు 
తోపు లాట లున్న తొనకరెపుడు
సన్నిహితము పెరిగి సహవాసు లయ్యేరు
శత్రువు బావ మంత సమసి పోవు

ఆట స్థలములు లేనట్టే పాఠశాల
లెక్క లేనన్నివచ్చాయి నిక్కమిపుడు
క్రీడ లాడుట యెరుగరు ఖేద మిదియు
సహన మబ్బుదు పెరగదు శక్తి యుక్తి
   

     
 

కామెంట్‌లు