రవీంద్ర, జగన్ స్నేహితులు. డిగ్రీ దాకా చదివారు.ఇద్దరూ చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశారు.దొరకలేదు.
రవీంద్ర పుస్తకాలషాపు పెట్టాడు.
జగన్ ఉద్యోగప్రయత్నాలు మానలేదు. అవసరమైన కవర్స్ ,బుక్స్ రవీంద్ర వద్ద కొనేవాడు.రవీంద్ర వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
ఉద్యోగప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన జగన్ తన బాధను రవీంద్ర వద్ద వెళ్ళగ్రక్కాడు.
రవీంద్ర నవ్వి "ఒరే!ఎంతో కొంత చదువుకుని ప్రతి ఒక్కరూ ఉద్యోగమంటూ ప్రభుత్వం మీదపడి బాధపడితే అందరికీ ఉద్యోగాలు ఎక్కడనుండి వస్తాయి. చదువు నీకు జ్ఞానాన్ని,సమస్యాపరిష్కారశక్తిని ఇచ్చింది. నీవూ నాలాగ స్వయంఉపాధిని ఏర్పాటు చేసుకొని అవసరమనుకుంటే ఉద్యోగప్రయత్నాలు చేయి. తల్లిదండ్రులకు ఇంకా భారం కాకు. ఎప్పుడో ఉద్యోగమొస్తుందని ఎన్నాళ్ళు భారంగా బతుకుతావూ?సంపాదిస్తూనే ప్రయత్నాలు కొనసాగించు."అన్నాడు.
రవీంద్ర మాటలతో జగన్ ఆలోచనావిధానంలో మార్పు వచ్చింది. రెడీమేడ్ దుస్తులవ్యాపారం ప్రారంభించి నేర్పుతో దినదినాభివృద్దిని సాధించాడు.
స్వయంఉపాధి...డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడప జిల్లా.-9440703716
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి