గోలీ మిఠాయిలు మోసే మల్లెలం
వాడ వాడ లో వాటిని విక్రయిస్తాం
గోడనీడలో చేరుకొని విశ్రమిస్తాం. !
మేళం పాటలంటే కాసంత ఇష్టం
వేలం పాటలంటే కిస్కింత కష్టం
మేం కోలాటం మా బాగా వేస్తాం
ఏం గలాటా లేకుండా మేం చూస్తాం
మేం చెడుగుడు ఆటలు ఆడుతాం
మా గుడుగుడు గుంచం పాడుతాం
ఆటపాటలతో కలుగు ఆరోగ్యం
వాటితోనే వెలుగు మహాబాగ్యం!
డింగ్ డాంగ్ పాటలు పాడుతాం
రింగ్ బాలు ఆటలు ఆడుతాం
ఆటల్లో మేము ఆరితేరినవారలం
పాటల్లో కోరి చేరిన మంచిపోరలం
చిత్తు బొత్తు ఆటలు ఆడుతాం
గమ్మత్తుగా పాటలు పాడుతాం
ఆటపాటలతో ముందుకేసాగుతాం
ప్రతిభవాటంతో మేం చెలరేగుతాం
తడబడు అడుగుల మేం వేస్తూ
అడుగిడి మాబడిలో మేం మస్తు
అల్లిబిల్లి ఆటలు అన్ని ఆడుతాం
పాలవెల్లి పాటలు అన్ని పాడుతాం
మా మంచి ఆటలతో అలరిస్తాం
మేం ఎంచి పాటలతోమురిపిస్తాం
బహు ఆటలపోటీలు జరిపిస్తాం
మహా బహుమతులు ఇప్పిస్తాం
మా ఆటపాటల ఆనందంతో
తెలివితేటల అనుబంధంతో
తక్షణ సన్మార్గం మేం శోధిస్తాం
రక్షణ దుర్గాన్ని మేం సాధిస్తాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి