జవానులం-కిసానులం:=గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

కిసానులం మేం కిసానులం
జవానులం మేం జవానులం
ప్రప్రథమున మేం కిసానులం
మా ప్రయత్నంతో జవానులం !

మా కన్నతల్లి శ్రీమతి అన్నపూర్ణ
మాకున్న నాన్న శ్రీ శ్రీ శ్రీ దానకర్ణ
మేం వారి మురిపాల పట్టీలం
వారికి పుట్టిన జగత్ జెట్టీలం !

కిసానులం మేం కిసానులం
మా భారతీయ కిసానులం
మేం హారతీయు కిసానులం
తస్మత్ జాగ్రత్త జవానులం !

హలంపట్టిపొలందున్ను హాలికులం
జలంపెట్టి గొర్రు కొట్టు శ్రామికులం
జన జాతర సాగించు జవానులం
మేం జనులందరిప్రేమాభిమానులం

మా దేశం సరిహద్దు జవానులం
ఆదేశం అందుకున్న కిసానులం
మా భారత భూమి సేవచేసి మేం
మా చరిత చాటు  వీరజవానులం !

మేంకిసానులం జనం జవానులం
మా పొలంలోని గడ్డి గదరా పీకేస్తా
దుక్కి దున్ని పొలంలో ఎరువేస్తాం
ఖుద్దుగ మేం వ్యవసాయం చేస్తాం !

చెత్తాచెదారాన్ని మేం పోగేస్తాం
కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాం
మా పంట పొలానికి తో లేస్తాం
మేం బంగారు పంటలు పండిస్తాం !

కామెంట్‌లు