ఓ బొజ్జ గణపయ్య:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.నాగర కర్నూల్ జిల్లా.సెల్,నెం.9491387977.
మేం గుజ్జనగూళ్ళ పిల్లలం
మా బొజ్జ గణపతి మల్లెలం
ఆ స్వామి యే మాకు పెన్నిధి
చేరుతాం మేం ఆయన సన్నిధి.

బుజ్జి బుజ్జి పిల్లలంఓ బొజ్జ గణపయ్య
ముద్దుచేసి ఆదుకునే మా ఒజ్జ నీవయ్య 
సిద్ధి బుద్ధి మాకు నీవు అందించు
ప్రతి పొద్దు చేయు పూజకు నీవు స్పందించు

నీ రూపం స్వరూపం అపురూపం
తిలకిస్తే తొలగిపోవు మా శాపం
నీ నామం మధురం సు మధురం
జపించు తరించు లే మా అధరం .

పంచభూతాలకు దిశలనే పంచి
అష్టదిక్పాలకుల ఆలోచనలమించి 
సప్త లోకాలను పాలించినావు నీవు
లిప్తకాలాన మము దీవించినావు.

నీవు మెచ్చి

న పూలతో పూల దండలు గుచ్చి
తెచ్చిన అగరువత్తుల మా భక్తులు వెలిగించి
ప్రతి నిత్యం పూజిస్తాం గణపతి పప్ప
వ్రతసత్యం ధ్యానిస్తం నీవేలే గొప్ప.

మా కోరిన కోరికలను తీరుస్తావు
మేం అడిగిన వరాలను అందిస్తావు
కొండంత అండ వైన ఓతొండందేవరా
నిండైన మెండైన నీ దీవెన అందీయరా.