సూక్తిసుధ:--మిట్టపల్లి పరశురాములు --సిద్దిపేట--చరవాణి:9949144820

 *ఆ.వె*
*చెప్పుమాటలన్ని-యొప్పుగాదెప్పుడు*
*గాంచుచున్నవన్ని-కాదునిజము*
*సత్యమెరిగినీవు-సాగవలెనుముందు*
*మరువబోకుబాల-మంచిమాట*
*కం*
*చక్కని కుటుంభమందున*
*మక్కువచేతనుగలిసిరిమనుజులునాడున్*
*మిక్కిలిసంపదగలిగియు*
*చిక్కనిసంసారముననుచిగురులుతొడగన్*
*తే.గీ*
*విద్యచేతనుచేకూరు-వినయమెపుడు*
*వయసుపెరగననుభవమ్ము-వచ్చితీరు*
*నపుడె మంచితనమువచ్చు-నవనియందు*
*నిలుపుకొనుమోయిదానిని-నిక్కముగను*
*ఆ.వె*
*కనులనుండివచ్చు-కన్నిరుకనిపించు* 
*నెదనయున్నచింత-నెంతయున్న*
*తెలుసుకొనగలేరు-తెరువరులెవ్వరు*
*బాధదాచినగువు-భాగజూపు*

*తే.గీ*
*అర్థమెరగనివయసున-అరుదుగాను*
*సంతసమొసగుమనుజకు-చక్కగాను*
 *అన్నిదెలిసినసమయాన-నవనియందు*
*కనులకన్నీరుమిగులును-కనగనెపుడు*

*తే.గీ*
*నీకురావలసినదేదొ-నిక్కముగను*
*చేరగలదుగనీదరి-శ్రేష్ఠముగను*
*ప్రాకులాడగవలదుగ-పట్టుబట్టి*
*రానిదానికోసమునీకు-రభసయేల?*
*చింతనొకటియుమిగులును--చెంతరాదు*

కామెంట్‌లు