సినారె పై పద్యం:-*బెజుగాం* *శ్రీజ*-*గుర్రాలగొంది* *జిల్లా*: *సిద్దిపేట*

  *సీసం*
బుచ్చమ్మ,మల్ రెడ్డి పుణ్య గర్భమునందు
పుట్టె సినారెగపుడమినందు
హనుమాజిపేటలో నందరుమెచ్చగ
ఉత్సాహ మతనిలో నురకలేయ
సాహితీ రంగాన సాహిత్య గ్రంథాలు
పెక్కుకొలదివ్రాసి పేరుగాంచె
తెలగాణబిడ్డడై తెలుగుభాషకొరకు
మక్కువజూపించె మంచినెంచి
జ్ఞానపీఠ అవార్డు జగమంత వ్యాపించ
ధీరుడై వెలుగొందె దేశమంత
*ఆటవెలది*
యాసనందునున్న భాషనుప్రేమించి
ప్రజలహితముకోరి పాటుబడెను
తెలుగు సంస్కృతినెడ తేజరిల్లెడివిధము
నింపినాడు మనలొ నేర్పుతోడ
 

కామెంట్‌లు