కాలం మారుతుంది:-మచ్చరాజమౌళి దుబ్బాక (సిద్దిపేట జిల్లా)

పూల గుసగుసలకు 
వెసులుబాటు దొరికిందేమో

శిశిరం చేసిన వీడ్కోలులో
జలజలా రాలిన ఆకుల సవ్వడి
గలగలల శబ్దం చేస్తున్నాయి

వేదనలూ, ఆవేదనలూ 
వెంటాడే జ్ఞాపకాలు కావని 
ఆహ్వానం పలుకుతూ 
మోడువారిన జీవితాన  మొలిచిన ఆనందం
వసంతమై చిగురించింది


కామెంట్‌లు