ఇది చిన్నప్పటి సంగతే. కానీ ఇలా హుండీ చూసినప్పుడల్లా నాటి విషయం గుర్తుకొస్తుంది. నా దగ్గర హుండీ అనేదెప్పుడూ లేదు. కానీ మా పక్కింట్లో ఒకబ్బాయి హుండీలో చిల్లర నాణాలు దాచుకుంటే ఉండేవాడు. అతని పేరు శ్రీనివాస్. ఇప్పుడతను ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.
వాడి తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసేవారు.
హుండీలో నిండుతున్నట్టు తెలుసుకున్న క్షణాన శ్రీనివాసుకి ఓ ఆశ కలిగింది. హుండీలోంచి ఓ యాభై పైసలు తీసుకుని బేకరీకి వెళ్ళి బన్ బటర్ జామ్ తినాలన్నదే ఆ ఆశ. నాతో చెప్పాడు. వెంటనే వాడికి హుండీలోంచి ఎవరికీ తెలీకుండా ఓ యాభై పైసలు తీద్దామన్నాను. అలాగే ఓ కొబ్బరిపుల్లతో హుండీలోంచి ఓ యాభై పైసలకు చిల్లర నాణాలు తీసాం. ఆ డబ్బుతో బేకరీకెళ్ళి బన్ బటర్ జామ్ కొనుక్కుని షాప్ దగ్గరే తింటుండగా ఒకరు చూసి ఈ విషయం శ్రీనివాస్ వాళ్ళమ్మకు చెప్పారు. దాంతో శ్రీనివాసుతోపాటు నాకు తిట్లు పడ్డాయి. నాతో చెప్తే నేనే యాబై పైసలిస్తాను కదా వాళ్ళమ్మగారు చెప్పారు. ఇంకెప్పుడూ అలా హుండీలోంచి డబ్బులు తీయకూడదన్నారు.
అలాగేనని బుర్రూపాం ఇద్దరం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి