స్ఫూర్తి...రచన..అచ్యుతుని రాజ్యశ్రీ

 "అమ్మా!ఆకలి అన్నం పెట్టు" పదేళ్ళ రమ గొడవ చేస్తోంది. బడిలేకపోటంతో తోచక మొండి గా తయారు అవుతోంది. కరోనా భయంతో పిల్లలు ఇంటి లో కూచుని బోర్ అంటూవిసుగు చిరాకు తోఇల్లుపీకి పందిరేస్తున్నారు.రమకి తోబుట్టువులు లేరు.తల్లి కనకంకి ఓర్పు తక్కువ. "ఏంటీ మొండితనం?టి.వి.చూసుకో"."ఉహు!అదికూడా బోర్!" "పెద్దదానివైనావు.నీవే వడ్డించుకుని తిను"అని వీపుమీద ఒక్కటేసింది. "రా రమా!నేను  పెడతా"అమ్మమ్మ వరమ్మ తో"నీకు  జ్వరంగా! పడుకో.రోజూ  నీవే పెడతావుగదా?అమ్మ  అన్నిటికీ విసుక్కుంటుంది" "అమ్మ ఇంటి పనితోఅలసిపోతోంది.మీనాన్న ఏరాత్రో వస్తాడు.ఆయన వచ్చే దాకా మీఅమ్మకి  గుండె పీచుపీచు అంటుంది. " రమ బుద్ధి గా  కంచంముందు కూచుంది. కనకం ఆ ఇద్దరిమాటలు వింటు మధన పడుతోంది. "నాతల్లికి ఉన్న ఓర్పు నేర్పు నాకు లేవు."ఇంతలో  పక్కింటి ఆంటీ నిర్మల "కనకం!నా మనవరాలి గౌను కుట్టావా ?రేపు దాని  పుట్టినరోజు"అంటూ వస్తే "కూచోండి.ఇస్తా."అంది."వరమ్మా!జ్వరం తగ్గిందా?రమా!ఏంటీ  పెద్దగా రాగాలాపన చేస్తున్నావు?" "ఆంటీ!నా పని అడకత్తెరలో పోకచెక్క!పిల్ల మొండి  ఆయనదోవ ఆయనది.అమ్మ  మనవరాలికి వత్తాసు!మిషన్ పనితో నడుం లాగేస్తోంది". కనకం మాటలు వింటు  నిర్మల ఆంటీ అన్నారు "నీవింకా ముప్పై ఏళ్ళ పడుచువి.దేవుడు కూడు గూడు నా అనేవారిని ఇచ్చాడు.మీఅమ్మ కష్టం నీకు తెలీదా?అనవసరం ఆలోచన తో  ఉన్న ఆనందం  ప్రశాంతత పోగొట్టుకుని ఏంలాభం?నీకూతురికి పాటలు పద్యాలునేర్పు.చిన్న చిన్న పనులు చేయించు.చేసే పని దైవకార్యం గా భావించు."   "బాగా  చెప్పారు నిర్మల గారు!మా కనకంకి ఓర్పు తక్కువ.  నేను బీదకుటుంబంలోపుట్టి అత్తింటపడ్డ కష్టాలు మీకు తెలుసు. మగడు పోయాక మీదయవల్ల కనకంని చదివించి ఓ అయ్య చేతిలో పెట్టాను.అంతా  దైవేచ్ఛ!తృప్తి  సంతోషం లేక పోతే ఎలా?"
"వింటున్నావా కనకం?నీవు మారాలి."  "నాకళ్లు తెరిపించారు ఆంటీ!నాకన్నా  బాధలు పడేవారు ఎంతోమంది. ఒకరితో పోల్చుకుని అసంతృప్తి గా ఉండే నాకు  జ్ఞానోదయం  కలిగింది ".ఆనందం గా నవ్వారు ఆమె.సంఘసేవ ఇంటి కి వచ్చే పోయేవారు గుడి పూజ పునస్కారాలతోపాటు ఓ పదిమంది మహిళలకు యోగ మెడిటేషన్ తోపాటు చదువు నేర్పుతారు ఆమె."ఆంటీ!మీరు నాకు ఆదర్శమహిళ"అంటున్న కనకం భుజం తట్టారు.