*కోతి మూక - కోళ్ళ విజయం*(గేయకథ)-:రెండవ భాగము:-:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 5)
అంతలోనె ఆ కోడి
గుడ్లు పెట్ట సాగినది
రోజుకొక్క గుడ్డు లెక్క
కొన్నినాళ్ళు పెట్టె చక్క!
6)
గుడ్లను చూసీ కోటయ్యా
సంబరపడెనూ కదనయ్యా
వాటన్నిటిని పొదగేసీ
పిల్లలు కావాలని చూసే!
7)
ఆ వయ్యారి కోడీ కూడ
ఎంతో శ్రద్ధతో కూడ
రోజూ పొదుగుతు కూర్చుండ
పిల్లలు తయారు అయినాయి!
8)
పిల్లలు అన్నీ అందంగా
బొద్దుగ ముద్దుగ ఉన్నాయీ
ఆనందంతో కోటయ్యా
ఎగిరి గంతులు వేసెనయా!!
(సశేషం)
{ఫిబ్రవరి 2008 మొదటి వారంలో TV లో వచ్చిన ఒక వార్త ఆధారముగా}