అసూయ (నానీలు )--పిల్లి.హజరత్తయ్య-శింగరాయకొండ-ప్రకాశం జిల్లా
1) శరీరం 
పాప పూరితమైన 
వస్తువు 
అసూయతో కుళ్ళిపోతుందిగా..!

2) మనిషి 
ఆశలన్నీ.. 
మన పై వాటి మీదే
అసూయా! మజాకా..!

3) మనిషిని 
నిలవనివ్వదు 
కూర్చోనివ్వదు 
అదే! అసూయంటే..!

4) పూల తోటలో 
పూలు గుబాళింపు
మనిషి యెదలో 
అసూయ కుళ్ళు కంపు..

5)కళేబరాన్ని తినేది 
రాబందు.. 
మనిషిని పీక్కు తినేది 
అసూయేగా..!

6) అసూయ 
పడుతున్నావా!
అందలము సరే
అదఃపాతాళమే గతి సుమా..!

7) మనిషిని 
దహించివేసేది 
విషం చిమ్మేది 
అసూయనే కాలనాగేగా..!





కామెంట్‌లు