మమతల పందిరి.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఇంటి ముందర వేప చెట్టు నీడలో వాలుకుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు నారాయణ రావు.
లంకంత ఇల్లు పెద్ద లోగిలి ఉమ్మడి కుటుంబం వచ్చేపోయే అతిధులతో ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంటుంది.
ఆ వూరి సన్నకారు రైతు వెంకయ్య వచ్చి నమస్కారం చేస్తూ అమ్మాయికి పెళ్లి కుదిరిందని శుభవార్త చెప్పాడు.
అలాగే అంటూ భార్య లక్ష్మీదేవిని పిలిచి వెంకయ్యకు పెళ్లి తాంబూలం ఇవ్వమని చెప్పాడు.
లక్ష్మీదేవి లోపలికి వెళ్లి పసుపు కుంకుమ చీరలు తో పాటు కూడా పెట్టి వెంకయ్య వచ్చింది మీ అమ్మాయికి పెళ్లి కానుక గా ఇవ్వ మంది.
గొప్ప మనసున్న మీది పది కాలాల పాటు చల్ల గా ఉండమని నమస్కరించి వెళ్ళాడు రంగయ్య. అందరూ కొడుకు కోడళ్ల తో మనవళ్లు మనవరాళ్లతో సంతోషంగా ఉంటారు. మనకు అదృష్టం లేదంటూ బాధపడింది. ఒక్కగానొక్క కొడుకు. అమెరికా వెళ్లి అక్కడ అమ్మాయి అనే పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు ఇంతమంది ప్రేమను వదులుకొని అక్కడ ఎలా ఉంటున్నాడు అన్నది బాధగా. ఎవరి ఇష్టం వారిది పిల్లల భవిష్యత్తు కాదని చెప్పగలమా నీకే నా బాధ నాకు మాత్రం లేదా అన్నాడు నారాయణ రావు.
ఒకరోజు నమస్కారం అంటూ నారాయణ రావు కాళ్లకు నమస్కరించింది ఒక ఆమె.
ఎవరమ్మా నీవు అంటూ వచ్చింది లక్ష్మీదేవి. ఇద్దరూ బామ్మ తాతయ్య అంటూ కాళ్లకు నమస్కరించారు. ఎవరమ్మా మీరు మీరు ఎప్పుడూ చూడలేదు ఉన్నారు ఇద్దరూ. నా పేరు లక్ష్మీనారాయణ అంటూ ఐదేళ్ల పిల్లవాడు పేరు చెప్పాడు. నా పేరు సీతా మహాలక్ష్మి అంటూ తన పేరు చెప్పింది నాలుగేళ్ల పిల్ల. చూస్తుంటే తెలుగు వారి లాగా ఉన్నారు ఇంతకీ ఎవరు మీరు అన్నారు. నేను మీ కోడలిని పేరు సలస. వీళ్లిద్దరు మీ మనవడు మనవరాలు అనగానే సంబరపడిపోయి పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచెత్తారు. ఇంట్లోకి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసింది మహాలక్ష్మి. ఇంతకీ మా అబ్బాయి రాధాకృష్ణ రాలేదా అన్నారు బాగా. ఇన్నాళ్ల తర్వాత వస్తే మీరు ఏమనుకుంటారో అని రాలేదు మీ ఆరోగ్యం బాగాలేదని తెలిసి మేమే బయలుదేరి వచ్చాము. నాకు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు అన్నా చాలా ఇష్టం మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో ఇండియా రావాలని అనుకున్నాము అన్నది సి. మంచి పని చేశారు ఇది మీ ఇల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు చు అన్నారు. భార్య బిడ్డలు ఇండియా వెళ్లాక రాధాకృష్ణ కూడా వెళ్ళాలనిపించింది వెంటనే రెక్కలు కట్టుకొని వాలాడు. బాబాయి పిన్ని పెదనాన్న పెద్దమ్మ అందరూ తనని ఆప్యాయంగా పిలుస్తుంటే పోగొట్టుకున్న అనుబంధాలను మళ్లీ సంపాదించు కొన్నట్లు ఉంది. తల్లి ఒడిలో తల పెట్టుకుని చిన్నపిల్లల ఎక్కి ఎక్కి ఏడవ సాగాడు. నారాయణ రావు గారు ఆప్యాయంగా కొడుకు తల నిమురుతూ ఉన్నారు. ఇక్కడే అనుబంధాలు చూస్తూ ఉంటే మిమ్మల్నందర్నీ వదిలి వెళ్ళ బుద్ధి రావటం లేదు దూరపు కొండలు నునుపు అనుకొని మిమ్మల్నందర్నీ వదిలి వెళ్ళాను ఏం సాధించాను తెలియదు అందరిని దూరం చేసుకొని బాధపెట్టాను ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళను ఈ మమతల పందిరి లో నే నేను ఒక తీగను. ఈ పందిరి కింద జీవిస్తాను ఇక్కడే ఉండి మన పొలాలు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ నాన్నకి తోడుగా ఉంటాను. ఇన్ని రోజులు అజ్ఞానంతో జీవించాను నన్ను మన్నించి నాకు ఇక్కడే ఉండే అవకాశం ఇవ్వండి ఇ అన్నారు రాధాకృష్ణ. తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. ఇది నీ ఇల్లు అంటూ కొడుకును గుండెలకు హత్తుకున్నాడు. పిల్లలు ఇంటి ముందర స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నారు రాధా కృష్ణ భార్య అందరికీ స్వీట్లు పంచింది ఇండియాలో ఉన్న ఆనందం అనురాగం దూరం చేసుకోకూడదు ఈ మమతల పందిరిలో మనమంతా ఒక తీగకు పూసిన పువ్వులం అంటూ తాను కూడా అక్కడే ఉండి పోవటానికి నిశ్చయించుకుంది. నారాయణ రావు గారి కుటుంబం కొడుకు కోడలు పిల్లలు రాకతో కళకళలాడుతూ ఉన్నది.
కామెంట్‌లు