వినయవిధేయతలు:- శ్రీజ బెజగాం , గుర్రాల గొంది
1 *ఉత్పలమాల*
పెద్దలుచెప్పెమాటలను-
పిల్లలుశ్రద్ధగనాచరించినన్
వద్దనకుండవారుమన-
బాగునుకోరియుబుద్ధిమాటలే
ముద్దుగ చెప్పినంతవిన-
మోదము  జెందగ మంచిగల్గునే 
బొద్దుగ  నేర్చినంతటను
బూరిగవిద్యలువచ్చుచుండునే!

2. *కందం*
వినయవిధేయతలుమనకు
కనకమువలెగోచరించ కాంతియెజిమ్మున్
మనమే శ్రద్ధగ మసలిన
ఘనముగ కీర్తియెపెరుగగ గౌరవమబ్బున్.


కామెంట్‌లు