బాలగేయం:-సత్యవాణి

 కల్లలాడబోకు బాల
ముళ్ళబాట నడువకు
చెల్లు మాటలాడు బాల
పొల్లు మాటలాడకు
అచ్చు హల్లులు నేర్వుబాల
ముచ్చటైన తెలుగులో
హెచ్చు పదములెన్నొ గలవు
ఇంపుగాను తెలుగులో
పదము పదము కలిపినంత
కథా కావ్యమగునులే
సొంపు కలుగు రాగమైన
పాట పద్యమగునులే
              
కామెంట్‌లు