రంగు రంగుల పిట్టా
ఎన్ని హంగులు ఇట్టా
ఇంద్ర ధనుస్సులయ్యె
మిమ్ము చూడక ఎట్టా !
కొమ్మ బారున కూడిరి
రెమ్మ తోటీ ఆడిరి
ఏళ్ల తరబడి చేలను
అమ్మ కిలకిల లాడిరి!
కొద్ది గింజలు చాలులె
ఒద్దిక గానూ తినులె
శుద్ధ మైనది హృదయం
బుద్ధి దైవం సమములె!
పిట్ట లారా రండీ
బుట్ట గింజలు తినుడీ
చిట్టి గుడ్లను పెట్టగ
గట్టి గూడు అల్లుడీ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి