సీసమాలిక
తల్లిదండ్రి పలుకు దైవంగనెంచియు
నీతి నియమముల నెరుగ వలయు
పట్టుదలగనీవు పని జేసినప్పుడే
మెట్టు నెక్కగలవు మేదిలోన
పెద్దల మాటలు పేర్మితో గుర్తించి
అనుసరించవలెను యవనిలోన
ఆత్మవిశ్వాసమే యందల మెక్కించి
విజయాలలో నీకు వెలుగునిచ్చు
వినయ విధేయతే విజయాన్ని గల్గించు
ధర్మాచరణతోనెధరణి వెలుగు
విజ్ఞానవంతులా విజయాలనెరిగియు
సంకల్ప బలముచే సాధన జేయుము
తే:
మంచిచెడుల విశ్లేషణ మార్గముగను
బుద్ధితోనీవు పెద్దగా నెదిగినపుడు
ఒదిగి నుండుట మంచిది నోర్పు తోడ
శిఖర మైనిల్చి నీపేరు శీర్షమెక్కు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి