సుబ్బారావు ఉదయం ఆఫీసుకి వచ్చినప్పటినుంచి డల్ గా కనిపిస్తున్నాడు వర్క్ మీద ధ్యాస లేదు.
ఏదో విచారంలో మునిగిపోయినట్లు ఉన్నాడు.
పక్క సీట్లో ఉన్న రాజారావుకి విషయం అర్థం కావడం లేదు లంచ్ టైం లో సుబ్బారావు దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించాడు.
సుబ్బారావు సమాధానం చెప్పలేదు.
ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు.
డబ్బు ఏమైనా కావాలా అన్నాడు.
తల అడ్డంగా ఊపాడు సుబ్బారావు.
ఇంతకీ ఏమిటి మీ సమస్య అని మళ్ళీ అడిగాడు.
స్నేహితుడితో తన బాధ చెప్పుకోవాలని పించింది.
. విషయం విన్నాక రాజారావు కాసేపు ఆలోచించి గొప్ప చిక్కు లోనే పడ్డావు దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది నేను చెప్పింది చేస్తానంటే సలహా ఇస్తాను అన్నాడు రాజారావు.
రాజారావు చెప్పబోయే సలహా కోసం ఆశగా ఎదురుచూశాడు సుబ్బారావు.
దీనికి ఒకటే మార్గం నేను చెప్పినట్లు చేసావంటే నీ ప్రాబ్లం తీరిపోతుంది అన్నాడు.
ఏమిటో చెప్పమన్నాడు.
రాజారావు చెప్పింది విన్నాక భయంగా చూశాడు సుబ్బారావు.
దాన్ని అమలు పరచాలి అంటే చాలా కష్టం అయినా తప్పదు అంటూ ఏమాత్రం పైకి కనిపించకుండా రాజారావు చెప్పినా సలహా పాటించడానికి సిద్ధపడ్డాడు.
రాజారావు చెప్పాడంటే దానికి తిరిగే లేదు ధైర్యాన్ని కూడదీసుకుని రంగంలోకి దిగాడు సాయంత్రం కొత్త స్కూటర్ మీద దర్జాగా ఇంటి ముందు.
దిగాడు.
భార్య మీనాక్షి స్కూటర్ చూడగానే సంబరపడిపోతూ ఏమండీ ఇది మనదేనా అన్నది సంతోషంతో.
మనది కాకపోతే ఎవరిదైనా ఎత్తుకొని వచ్చానను కొన్నావా.
ఇది ఎప్పటికీ మనదే త్వరగా రెడీ అయ్యావ్ అంటే గుడికి వెళ్లి వద్దాం అన్నాడు.
మీనాక్షి లోపలికి వెళ్లి నిమిషంలో తయారై వచ్చింది భార్యని స్కూటర్ మీద అ ఎక్కించుకొని మొదటిసారిగా గుడికి వెళ్లి నిమ్మకాయలు కట్టించి పూజ చేయించాడు అటునుంచి హోటల్ కి తీసుకు వెళ్ళాడు సాయంత్రం పిల్లల్ని కూడా ఎక్కించుకొని సరదాగా తిప్పుకొని వచ్చాడు.
నిన్నటిదాకా రుసరుసలు కోప తాపాలు చూపించిన మీనాక్షికి భర్త మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది.
రెండు రోజుల తర్వాత ఆఫీసుకు అని వెళ్లిన సుబ్బారావు ఇంటికి రాలేదు.
భార్య మీనాక్షి కి కాళ్ళు చేతులు ఆడటం లేదు.
భర్త ఎక్కడికి వెళ్ళాడు తెలీదు.
ఆఫీసు నుంచి కబురు వచ్చింది సుబ్బారావు ని తీసుకురమ్మన మన్నారు.
ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియదంది. సుబ్బారావు ఆఫీసు డబ్బు 50000 వేలు చెప్పకుండా తీసుకు వెళ్లారట ఆ డబ్బు ఏం చేశాడు రెండు రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఉద్యోగం తీసేస్తామని చెప్పారు.
వెంటనే వచ్చి ఆఫీసు డబ్బు కట్టమన్నాడు.
ఓరి భగవంతుడా ఇదెక్కడి గోల రా ఆయన ఆఫీసు డబ్బు ఎందుకు తీసినట్లు ఇంతకీ ఎక్కడికి వెళ్లి ఉంటారు అంటూ సో కాలు పెట్టింది.
సుబ్బారావు ఆ రాత్రికే ఇంటికి వచ్చాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు ఆఫీసు డబ్బు మీరేమైనా తీశారా రెండు రోజుల్లో ఆ డబ్బు కట్టకపోతే ఉద్యోగంలో నుంచి తొలగించేస్తారు అన్నది ఏడుస్తూ.
మరీ మంచిది హాయిగా ఇంట్లో కూర్చుంటాను అన్నాడు తాపీగా.
ఇంట్లో కూర్చుంటే పిల్లల గడుస్తుంది ఉద్యోగం లేకపోతే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తారు ఇంతకీ ఆ డబ్బు మీరే తీసారా అంటూ నిలదీసింది.
నేనే తీసాను దీనికంతటికీ కారణం నువ్వే అన్నాడు.
నేనా అన్నది ఇది ఆశ్చర్యంగా.
అవును ముమ్మాటికీ నువ్వే ఎదురింటి వాళ్ళు అది కొన్నారు పక్కింటి వాళ్ళు ఇది కొన్నారు అంటూ మనకు స్కూటర్ లేదని కొనే దాకా సాధించి పెట్టావు నీ గోల పడలేక అప్పు చేయటం ఇష్టంలేక ఆఫీసు డబ్బు తీశాను ఇప్పుడు పరువు కూడా పోయింది ఏ ముఖం పెట్టుకుని ఆఫీసుకు వెళ్లడం అన్నాడు సీరియస్ గా.
స్కూటర్ కొనమంటే ఆఫీస్ డబ్బు కా జేయమనా అర్థం మీ సొంత డబ్బుతో కొన్నాను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనుక్కుంటాం సరదా లేదు లేదు రేపు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ల కోసం దాచాలి కదా.
మిమ్మల్ని కారు కోన మన లేదు కదా. స్కూటర్ ఏ కదా అడిగింది. మీ ఉద్యోగం పోతుందని తెలిస్తే అడిగే దాన్ని కాదు.
ఇప్పటికైనా నా మించిపోయింది లేడు ఆ స్కూటర్ అమ్మేసి ఆ డబ్బు ఆఫీసులో కట్టండి చాలకపోతే నా మెడలో ఉన్న గొలుసు కూడా ఇస్తాను ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయకండి అంటూ మెడలో ఉన్న తీసి ఇచ్చింది.
రాజారావు చెప్పినా సలహా బాగానే ఉపయోగ పడినందుకు థాంక్స్ చెప్పాడు . ఆ స్కూటరు తీసుకువెళ్లి రాజారావుకి ఇచ్చేశారు ఆఫీసు డబ్బు తీసి కొన్నట్లు నాటకం ఆడాడు. మొత్తానికి కథ సుఖాంతమైంది మీనాక్షి భర్తను ఏది కొనమని అడగదు సుబ్బారావు యధావిధిగా ఆఫీస్ కి వెళ్తున్నాడు.
ఉన్నదాంట్లోనే తృప్తి పడాలి కానీ ఎదుటివారు ఏదో కొనుక్కున్నారు అని మనము వాళ్లతో సమానంగా ఉండాలనుకోవడం మంచిది కాదు మీనాక్షి కోరిక తీర్చాలని డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు సుబ్బారావు.
సుబ్బారావు స్కూటర్.:-తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి