తొలి పొద్దు పొడుపు..... జయశంకర్ సార్.:-మచ్చ అనురాధ-సిద్దిపేట.

 జన్మించె శంకరు జనని మహాలక్ష్మి 
తండ్రి కాంతారావు తనయుడిగను,
అక్కమ్మ పేటలో యద్భుతమ్ముగ బుట్టి
యూరు పేరు నిలిపె యుర్వియందు,
విద్యార్థి దశ నుండె విశధించి తెలగాణ
ముచ్చట్లు తెలిపెను మూల మెరిగి,
ఉద్యమాలు నడిపి యూరురు తిరిగెను
పోరాటయోధుడు పోరు సల్పి,
తెలగాణ రాష్ట్రము తెచ్చుటే నాకల
యూపిరున్న వరకు  నుద్యమిస్త,
మాట దీసుకొనియు  మనుగడ సాగించి
పెళ్లి మానుకొనెను భీష్ము డితడు,
తెలగాణ రాష్ట్రాన తేకువ  జూపియు
తొలి పొద్దు పొడుపుగ దేశమందు,
కీలకపాత్రను గొప్పగ పోషించె
జయశంకరు సారు జయయు మీకు.
తేటగీతి.
భావజాల వ్యాప్తిని జేసె బాగుగాను,
బోధ జేసెను పాఠాలు బుద్ధుడితడు,
సారు జయశంకరుగ  పేరు సార్ధకంబు,
గగన మందున ధ్రువతార ఘనతకెక్కె,
మరువ లేము మీ సేవలు  మదిననెపుడు.