*సూక్తిసుధ*: పరుశురాములు మిట్టపల్లి
కం
ఉపకారముపొందిననిల
నపకారముజేయబోకనైవేద్యముతోన్
జపమునుజేసినవిధముగ
నుపకారమెచేయమేలునుర్వినరామా

అమ్మనాన్నగురువు-నాదిదైవంబులు 
పెద్ద వారి సేవ -పెరుగునుకీర్తియే  
భక్తి తోడజేయ- ముక్తి లభించును 
పరశురాము మాట-పసిడిమూట


ధర్మ మార్గమెపుడు-దప్పినడవరాదు 
నీతిదప్పిమెలగ-ఖ్యాతిగాదు      
జగతిధర్మసత్య-సుగతిమార్గమ్మురా! 
పరశురాము మాట-ప్రగతిబాట

లక్ష్యసాధనెంచ-లక్ష్యముచేకూర
కూర్పుపదముమంచి-నేర్పుగాదె
 విజయమొందగలరు-విశ్వమేమెచ్ప
పరశురాముమాట -ప్రగతిబాట


కామెంట్‌లు