తాత రేడియో లో భక్తిరంజని వింటున్నాడు. అమ్మమ్మ వంటింటిలో కాఫీ కలుపుతోంది. శివ బాల ఇంకా మంచం మీదే ఉన్నారు. ఇంతలో సెల్ మోగటం ఆలస్యం ధన్ మని మంచంపై నించి దిగిన కోడలు కనకం"హాయ్ హలో! ఓ.కే." అరగంట పైగా సుత్తి కొడుతూనే ఉంది. తాత పూజచేస్తుంటే అమ్మమ్మ స్నానం ముగించి వంటింట చొరబడింది. కనకం జిడ్డు బంక సీరియల్ లాగా అలా ఆగకుండా వాగుతూనే ఉంది. ఇంతలో స్వామి కేకవేశాడు."కనకం! నాకు ఇవ్వాళ అర్జంటుమీటింగు! ఎనిమిది కల్లా ఆఫీసులో ఉండాలి. "అప్పుడు వదిలింది సెల్. తీరిగ్గా మొహంకడిగి వచ్చిన ఆమెకి కాఫీ ఇచ్చింది అమ్మమ్మ. ఇడ్లీపిండి గిన్నెను స్టౌ పై పెట్టింది. "అత్తయ్యా!ఫ్రిజ్ లో కూరలు తరిగిఉంచా.కూర చేయండి ".మళ్ళీ సెల్ పట్టుకున్న కనకం తో ఖచ్చితంగా అంది "నేను పూజచేసుకోవాలి.వంటపని నీవు చూసుకో." "హు..ఈవిడగారికి సెల్ అంటే ఎలర్జీ!"అని కారాలు మిరియాలు నూరుతూ గ్లాసుని సింక్ లో విసిరింది. స్వామి ఫోన్ మోగింది."ఆ!ఎస్ సార్!కమింగ్..ఓ.కే.ఓ.కే.ట్రాఫిక్ జామ్ సర్!కూకట్పల్లికి కారు పంపండి. నేను భాను కలిసి వస్తాం ".వెంట వెంటనే ఫోన్ పెట్టేసిన కొడుకు ని మనసులో నే దీవించింది.తాత పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాడు.ఆయన పూజ ఓగంటపైగా పడుతుంది. ఇంతలో సెల్ ఫోన్లు చెవిలో చిల్లులు పెట్టసాగాయి.ఒకటి శివది రెండోది బాలది. ఆన్లైన్ క్లాసులు కదా!? ఓఅరగంటముందు హెచ్చరిస్తారు. కనకం గావుకేకలతో పిల్లలు ఇద్దరు మంచం మీద నుంచి దూకారు. 'అమ్మా!పాలు...'గావుకేకలు!"ఛ ..ఛ..పాచిమొహాలు!"కనకం అరిచింది. "అమ్మా!స్పెషల్ క్లాసు!"శివ గంతులేస్తున్నాడు."ఆన్లైన్ !తొందర ఏంటీ?" 'ఉహూ! యూనిఫాం టైంతో సహా కనపడాలి."అంటూ శివ తయారైనాడు.బాల అంటోంది 'మా ఫ్రెండ్ హాపీ బర్త్ డే!'.ఆపిల్ల ఫోన్ గొంతు చించుకు అరుస్తోంది. స్వామి కోపం తో కథాకళి చేస్తున్నాడు "ఇన్ని ఫోన్లు తిక్కరేపుతున్నాయి.పైగా డబ్బులు నెలకి రెండు వేలు హూష్ కాకి!తెల్లారకుండానే మీ అమ్మ సుత్తి!అందరికీ కలిపి ఒకేఒక ఫోన్ చాలు. లాండ్ లైన్ పెట్టిస్తాను." "నాన్నా!మా ఇద్దరివి వేర్వేరు బడులు.టైం ఒకటే".ఏడుపు గొంతుతో అంది బాల. "కరోనా టైం లో బర్త్ డే గిర్త్ డే జాన్తా నై..ఇల్లు కదలటానికి వీలు లేదు."భర్త నుఅనలేక పిల్లలను కసిరింది కనకం. మామగారు పెద్దగా పూజ చేయటం ఆమెకి నచ్చదు. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని తాత వాదం.అందరి నోటి లో నాలుకలా అమ్మమ్మ స్వామి ఉండిపోతారు. ఫోన్ ఫ్రెండ్స్ కబుర్లు అవసరమే! కానీ పొద్దుగూకులూ ఫోన్లు చేస్తూ అవతలివారి చెవికి చిల్లులు పెడుతూ సుత్తి కొట్టడం కొందరి హాబీ!"ఏంటీ విశేషాలు?ఆసీరియల్ చూశారా? మన కాలనీ భాగవతం మీకు తెలుసా?"ఇలా కనకం వాగటం అమ్మమ్మ కి ఇష్టం ఉండదు. తల్లి కి సాయం చేయకుండా భార్య హస్క్ కొట్టడం స్వామి కి నచ్చదు. లాండ్ లైన్ పెట్టించి వీరి తిక్క కుదర్చాలని అనుకుంటున్నా డు.కానీ ఆన్లైన్ క్లాసులు!ఎలా? పరిష్కారం దొరుకుతుందో లేదో అనుమానమే!?
సెల్లు..చెవిలో చిల్లు. అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి