అక్షరానికి పుస్తక డ్రెస్సు
విద్యార్థులకు స్కూల్ డ్రెస్సు
పాఠశాలకు ప్రత్యేక డ్రెస్సు
అందరొకటని చెప్పే డ్రెస్సు
అమ్మాయీ , అబ్బాయైనా
బడి డ్రెస్సులో సాధకులైనా
పేదలు, ధనవంతులైనా
ఒకటేరా గురు సన్నిధినా
కులమూ మతమూ పట్టనిదీ
చదివుకే అందమిచ్చునదీ
పోటీలందున నిల్పునదీ
మొఖం మాటలనే తరిమేను
కలుపుగోలునే పెంచేను
జ్ఞాపకాలనే వృద్ధి చేయును
ప్రతిభలకే పట్టం గట్టును.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి