సీసమాలిక పద్యం
బహుముఖ ప్రజ్ఞతొ బాల్యము నుండియె
దీక్షను బూనిన ధీరుడితడు,
పదునాల్గు భాషలు పట్టుగ నేర్చిరి
యపరమేధావియె యవనియందు,
రాజకీయ పదవిని రమ్యముగను జేసి
దేశ ప్రధానిగా తేజమలరె,
నార్థిక శాస్త్రంన నారితేరిన వారు
తీర్చిదిద్దెను జూడ దివ్యముగను,
పలు చట్టములు దెచ్చి ప్రజల బాధలు దీర్చె
పూర్ణకుంభ విధము పూజ్యుడి తడు,
వంగర వాసియై వసుధకు కీర్తియై
తెలుగు వారి వెలుగు తీపి గుర్తు,
నరసింహ మూర్తి యే నామము , లేదుగా
ఇసుమంత కోపము, యెందుజూడ
మౌనమే నాయుధం మహిమాన్వితుడు పీ. వి
కనలేము ఇటువంటి ఘనత ఠీవి.
తేటగీతి
దేశ యౌన్నత్యమును బెంచి తీర్చిదిద్దె,
తెలుగు జాతికి వెలుగుల రేఖ వీవు,
గగన తారల నిలిచారు గనక మీరు,
దివిన మీ పేరు నిలిచెను దివ్యముగను,
దండ మిడుదుము నందరం దైవసమము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి