నే పుట్టి పెరిగింది
చక్కని పల్లెటూరు !
' దిండి 'గ్రామం -
అది చైతన్యారామం !!
-------------------------------
ఆత్మీయతలకు,
నిలయం అప్పుడు!
పట్నపు సంస్కృతికి
నిశానీ ఇప్పుడు....!!
---------------------------------
పల్లెటూరి మూలాలు
గ్రామ జీవనశైలి,
నేను గ ర్వపడే-
ఆభరణాలు ....!
----------------------------------
అదృష్టం నన్ను
పల్లెటూరై వరించింది !
నాపిల్లలకు .....
అందని ద్రాక్షపండే !!
----------------------------------
నానీలు ....!! (పల్లెటూరు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మకొండ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి