ఎమర్జెన్సీ --ఎర్ర త్రికోణం ..!!:-ఎ.రజాహుస్సేన్.-- హైదరాబాద్.


 ఎమర్జెన్సీ అంటే  ఇందిరాగాందీ ,ఎర్ర త్రికోణం అనగానే కథా (నవలా )రచయిత శ్రీ కె .కె .మీనన్ 
గుర్తుకు వస్తారు .కారణం ఎమర్జెన్సీకి ,మీనన్ గారి 
కథ ' ఎర్ర త్రికోణం' కు ,దగ్గరసంబంధం ఉండటమే !
అందుకే --
  
ఎమర్జెన్సీ నీలి నీడల్లో...ఎర్ర త్రికోణం కథ..
కమామీషు..ఏమిటో తెలుసు కుందాం .
కథా రచయిత ‌కె.కె.మీనన్‌ మొదటి కథల సంపుటి 'ఇది స్ట్రీకింగ్‌ కాదు' లో మొత్తం 16 కథలు న్నాయి. దీనిలోని  ఓకథ 'ఎర్ర త్రికోణం'.గురించి ఇప్పుడు
తెలుసుకుందాం.దీని నేపథ్యం 1975 జులై 25 న
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన
ఎమర్జెన్సీ..!!
'ఎర్ర త్రికోణం' కథను 1973వ సంవత్సరంలో'రంజని' 
కోసం గారు రాశారు మీనన్. హైద్రా బాద్‌లోని ఎ.జి 
ఆఫీసులో ఆయన  పనిచేసేవారు.ఆకార్యాలయంలో
పనిచేసే తెలుగు ఉద్యోగు లందరూ కలిసి 'రంజని' అనే సాహిత్య సంస్థను స్థాపించుకున్నారు.ఆ సంస్థ
కు కొన్ని సంవత్సరాల పాటు మీనన్‌, వివిధస్థాయి
ల్లో తన సేవలను అందించారు. రంజని సభ్యుల కథలను 'రంజని' పేరుతోఒక కథా సంపుటి‌ కూడా  వెలుగులోనికి వచ్చింది. ఆ కథా సంకలనం 
కోసమే మీనన్‌" ఎర్ర త్రికోణం "కథను రాసినట్లుగా చెబుతారు.
 'ఎర్ర త్రికోణం' కథా నేపథ్యం తెలంగాణ ప్రాంతం
లోనివరంగల్‌ జిల్లా, మహబూబాబాద్‌కు చెందింది. ఓయదార్థసంఘటనను నేపథ్యంగా తీసుకుని మీనన్‌ ఈ కథను రాశారు.చాలా పాపులర్ కథ ఇది.
1970లలో, మీనన్‌ గారికి కందిగట్ల మందేశ్వర
రావు అనే మిత్రుడుండేవాడు.ఈయన తూ.గో. జిల్లా వాసి, వరంగల్ జిల్లా బలపాలలో,ఉపాధ్యాయుడిగాపనిచేసేవారు(.ప్రముఖ కమ్యూనిస్టు కామ్రేడ్‌ కందిగట్ల నాగభూషణం గారికి ఆయన స్వయాన  తమ్ముడు. ) మందే
శ్వరరావును చూడడానికి మీనన్‌ హైద్రాబాద్‌ నుండి, 
బలపాలకు వెళ్తుండేవారు. ఆయన ఎప్పుడు మహ
బూబాబాద్‌ రైల్వేస్టేషన్లో రైలు దిగినా,  రైలెక్కినా..
ఈ, 'ఎర్రత్రికోణం' కథలోని పాత్రధారి వెంకటేశు ప్రముఖంగా కన్పిస్తుండేవాడట.ఎప్పుడూ అతడ్ని చూస్తూఅతని జీవనశైలిని పరిశీలించేవారు మీనన్.
'ఎర్రత్రికోణం ' అనగానే మనకు కుటుంబ నియంత్ర
ణ సింబల్ కళ్ళల్లో మెదులుతుంది.1970ప్రాంతంలో
నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చిన్న కుమారుడు  సంజయ్  గాంధీ, కుటుంబ నియంత్రణ కార్యక్రమాల
పై ప్రత్యేక శ్రద్ధ చూపించే వాడు.కుటుంబ నియంత్రణ
కు సంబంధించి ఆ రోజుల్లో ఎమర్జెన్సీ ఓ అస్త్రంగా
ఉపయోగపడింది.ఎమర్జన్సీ ముసుగులోఅప్పట్లో
కుటుంబ నియంత్రణ కు లక్ష్యాలు నిర్ణయించారు.
ఎక్కువ ఆపరేషన్లు చేసిన వారికి  ప్రోత్సాహకాలు,
ఇంక్రిమెంట్లు,ఇచ్చేవారు.దీనికి బ్రోకర్లు, ప్రమోటర్లు,
వుండేవారు, ఎక్కడ చూసినా ఫ్యామిలీ ప్లానింగ్ మాటలే. ఇలాంటి పరిస్థితుల్లో విచక్షణ లేకుండా  టార్గెట్లను అధిగమించడానికి పోటీ పడేవారు అవ
సరం లేనివారికి,చివరకుపెళ్ళికాని వారికి కూడా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 
చేసేవాళ్ళు. ఆరోజుల్లో …. ఎమర్జెన్సీలో ఇదో …
చీకటి కోణం.
*కథా కమామీషు..
వెంకటేశు..ఓ భిక్షగాడు.బ్రహ్మచారి.నా అనేవారు
లేరు.మతిస్థిమితం కూడా అంతంత మాత్రమే.
ఓరోజు వెంకటేశు వైద్య సిబ్బంది కళ్ళల్లోపడ్డాడు.
వెంకటేశుని బలవంతంగా లాక్కెళ్ళి 'వేసెక్టమీ' ఆపరేషన్‌ చేశారు.ఆపరేషన్‌ చేయించుకుంటే ప్రభుత్వం  యిచ్చే పారితోషికంలో సగం మొత్తాన్ని అసుపత్రికి చెందినవాళ్లు నొక్కేశారు. శస్త్ర చికిత్స
లో నిర్లక్ష్యం కారణంగా రక్తం కారి, పుండు పడింది.,
ఆ బాధను భరించలేక ప్రైవేటు అసుపత్రికి వెళ
తాడు వెంకటేశు.చికిత్సకు సరిపడ డబ్బులేదని
ఆస్పత్రి వాళ్ళు వెంకటేశును బయటకు వెళ్ళ...
గొడతారు.
వేళకాని వేళ దుకాణ సముదాయం దగ్గర పడుకు
న్నాడనిపోలీస్‌ కానిస్టేబుల్‌ వెంకటేశాన్ని  నాలుగు
తన్ని, అతని దగ్గర మిగిలివున్న  రెండురూపాయల్ని
లాక్కకుంటాడు.ఆపరేషన్ పుండుకు తోడుగా కాని
స్టేబుల్‌ బూటు కాలిదెబ్బలకు రక్తస్రావ మవుతుంది. ఆ తర్వాత వెంకటేశు మరణిస్తాడు. యిదీ…. క్లుప్తంగా కథ.
మీనన్‌ ఈ కథను మనసు పెట్టిరాశారు.కళ్ళతో ప్రత్యక్షం గా చూసిన సంఘటన కాబట్టి ఆయన హృదయం  గాయపడి ఇలా కథగా మన ముందు నిలిచింది.ఈ కథ చదువుతుంటే.గాయం కత్తితో కెలికినట్లు, కట్టులోపల ముళ్ళపంది వెంట్రుకలు విప్పి గిరగిరా తిరుగుతున్నట్లనిపిస్తుంది.
రాజ్యాంగేతర శక్తి..సంజయ్ గాంధీ.!!
1970 ప్రాంతం లో ఎక్కడా చూసినా.. "ఎర్ర త్రికోణం' బాధామయ గాధలే.సంజయ్ గాంధీ ఓరాజ్యాంగేతర 
శక్తిగా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో చేసిన దుర్మార్గాలకు ఎందరో బలయ్యారు.ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టారు.ఫలితం
గా ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది.
నాటి ఇందిరా ఓటమిలో..  ఈ " ఎర్ర త్రికోణం " పాత్రకూడా వుంది.
ఈ కథ చదివాక…"ఐ హేట్..ఎమర్జన్సీ" …అని అనాలనివుంది..!!
మరింక ఆలస్యం ఎందుకు? అనేద్దాం.!!
*వుయ్ హేట్…. ఎమర్జెన్సీ…!!
----------------------------------------------
ఫోటోలు>కె.కె.మీనన్, ఇందిరాగాంధీ.
కామెంట్‌లు