యోగాసనాలు _ధ్యానం సూర్య నమస్కారాలు _ :-మొహమ్మద్. అఫ్సర వలీషా-ద్వారపూడి (తూ గో జి)

 యోగ దర్శన సూత్రధారి 
పతంజలి మహర్షి 
అష్టాంగ  యోగం  మనిషి
జీవన  స్థితి గతుల్ని మారుస్తుంది ....
అలసి సొలసిన మనసుకు
 ఆనందాల సాంత్వన ఆసనం
శ్వాసకు అనసంధానమిది...
శరీరానికి స్థిరత్వం 
మనసుకు శాంతి ......
శరీర మాలిన్యానికి యోగాసనాలు 
యమనియమ
ఆసన ప్రాణాయామం 
ప్రత్యాహార ధారణ  ధ్యాన సమాధి...
ప్రాణాయామం శ్వాస సంబంధిత ప్రక్రియ
శరీర మాలిన్యం నడవడిక తో చెక్ పెడదాం 
యమనియమ ప్రత్యహారాలు
మనో మాలిన్యం తరమడానికి..
యోగానికి అర్థం ప్రాధమిక స్థాయి కలయిక
శారీరక శ్వాస మనసుల కలయిక....
శక్తి నుపయోగించు
మనసుకు మానసిక 
 ప్రశాంతతను కలిగించు....
మనిషి ప్రవర్తన లో ఆశించిన మార్పు 
వైద్య శాస్త్రాలకు లొంగని 
రోగాల పరమావుషధి ఇది....
వ్యవస్థల మధ్య నున్న వికృతులను
 తరమడంలో అత్యంత నేర్పరి...
ఆరోగ్య కరమైన సంస్కృతులను 
అవయవాలను కలుగ చేస్తుంది...
మస్తిష్కంలోని మాలిన్యం 
భయం క్రోధం హింసా ప్రవృత్తి
తొలగినప్పుడే 
ఆరోగ్య వ్యవస్థ కు రోగ నిరోధక
శక్తి పరుగులు పెడుతుంది...
(యోగా దినోత్సవ శుభాకాంక్షలతో )

కామెంట్‌లు