సోమరితనం....అచ్యుతుని రాజ్యశ్రీ...

 మనం ఏ పనినీ వాయిదావేయకూడదు.హు...ఈచిన్నపని చిటికెలో చేయగలను అని ఆరోజు ఊరుకుంటే  అది ఏకుమేకై కూచుంటుంది.ఇన్నాళ్లు  కరోనా వల్ల మన ఇష్టమైనట్లు నిద్ర లేచి కాలక్షేపం చేశాము. రమ ఇప్పుడు పదోక్లాసు చదవాలి. షిఫ్ట్ ప్రకారం బడిలో తరగతులు నడుస్తాయి అనివార్త వినగానే ఖంగారు పడసాగింది.గబగబా లేచింది. ఇంతలో అమ్మ అరుపు వినపడినది. 
 . ఒకచిన్న కథచెప్పుకుందామా?ఒకరైతు భార్య తోకలిసి రెండు రోజుల తిరునాళ్ళకి బైలుదేరాడు.పెద్దకొడుకు శివకి పొలంపని చిన్న వాడు హరికి పశువులు కాసేపని అప్పగించాడు.మేము వచ్చే ప్పటికి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి అనిచెప్పాడు.శివ రోజూ వంట చేసి చద్దిమూట తో పొలం వెళ్ళి సాయంత్రం  తిరిగి వచ్చేవాడు. హరికి బద్ధకం ఎక్కువ. పశువుల పాక ఊడవలేదు.వాటిమొహాన  ఇంత గడ్డి పడేసి అన్నం తిని  మంచం ఎక్కేవాడు.శివ ఆరోజు  వంట చేయకుండా తెల్లారకుండానే పొలంకివెళ్లాడు.తోటిరైతులు పెట్టినది తిని సాయం త్రం  ఇల్లు చేరాడు.హరీ అని నిద్ర పోతున్నవాడిని లేపాడు."పాకలో గేదెలు అరుస్తున్నాయి చూడు."అన్నా!ఆకలిగా ఉంది. వంట చేయి.నాన్న ఇచ్చిన డబ్బుతో బజ్జీలు పకోడీ కొనితిన్నా." 'ముందు పాకశుభ్రం చేసి రా." పైపైన ఊడ్చిగడ్డి పడేసి వచ్చిన హరి తిక్క కుదర్చాలనుకున్నాడు శివ.అందుకే తెల్లారకుండానే పొలంకివెళ్లాడు. హరికి ఆరోజు అమ్మా నాన్న వస్తారని గుర్తు వచ్చి  పశులశాలలో పైపైన ఊడ్చి  మురికి తొట్టిలో వాటికి మంచినీరు పోశాడు. ఆపై ఇంటిలో అక్కడక్కడా కొవ్వొత్తులు పెట్టాడు. పాచిమొహంతో మంచంపై వాలాడు.ఇంతలో బైట నాన్న గొంతు వినిపించి గబగబా  నాలుగువైపులా ఉన్న కొవ్వొత్తులుతలుపులు  తీశాడు. "ఏంటిరా హరీ!దీపాలు వెలిగించావు.కరెంటు పోయిందా?"అమ్మ ప్రశ్నకు 'ఉహు..మీరు వచ్చే సమయానికి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి అని వీటిని వెలిగించా". వాడి మాట కి విస్తుబోయారు.పశులపాకలోకి అడుగు పెట్టిన నాన్న రంకెలు వేయసాగాడు"హరీ!ఇదేమిటి!చెత్త కుళ్ళు కంపు!రోజూ ఊడవటంలేదా?అయ్యో!ఆకుడితి తొట్టిలో పురుగులు లుకులుకలాడుతున్నాయి. వాటికి రోగంవస్తే ఎలారా?"
  వంట ఇంటిలో కెళ్ళిన అమ్మ కెవ్వుమంది"ఆగిన్నె మాడ్చి నాశనం చేశావేంటి.?" ఇంతలో కూరలు పట్టుకుని శివ వచ్చాడు."అమ్మా!మీరు వెళ్లినతర్వాత వీడు మంచంపై పడుండేవాడు.నేను  వండినది మెక్కుతూ ఉంటే వీడి రోగం కుదర్చాలని నిన్న వంట చేయలేదు. పొలం దగ్గర అందరికీ సాయం చేసిన నాకు  అంతా  తాము తెచ్చినది తలాకాస్తా పెట్టారు."  అంతే అమ్మా నాన్న హరికి నీతిబోధచేశారు.ఇల్లు కళకళలాడాలంటే దీపాలు పగలువెలిగించి ఖర్చు పెట్టమనికాదు.పాపం నోరు లేని జీవులని ఎంత హింసించావురా"?అంతే హరి చీపురు పట్టి పశువులకొట్టంలోకి వెళ్లితే శివ అమ్మ కి వంటింటిలో సాయం చేస్తున్నాడు.ఎవరికి కేటాయించిన పని వారు చేస్తే  ఇల్లు కళకళలాడుతూ ప్రశాంతంగా ఉంటుంది.
కామెంట్‌లు