కలకత్తా రైల్యే స్టేషన్ కు రైలు వచ్చి ఆగింది. మొదటి తరగతి పెట్టెలో నుండి ఓ ధనవంతుడు దిగాడు. అతడికి స్వాగతం పలికారు. ఆ రోజు వూరిలో గొప్ప సభ జరుగుతుంది. ఆ సభకు ఆయనే ముఖ్య అతిధి. ఆయనకు వసతి ఏర్పాటు చేశారు. చక్కని సదుపాయాలు కల్పించారు. సభ సమయానికి సభాస్థలికి తీసుకు వెళ్లారు. అదే సభకు నడుచుకుంటూ ఓ పెద్దాయన వచ్చాడు. నిరాడంబరంగా వున్నాడు. సభ మొదలయింది. ముఖ్య అతిధిని పిలిచారు. అందరూ ధనవంతుని వైపు చూసారు. అయితే సభ పైకి ఆ నిరాడంబరుడు వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నిరాడంబరుడు ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు. ఆయన భారతీయ సంఘసంస్కర్తలలో ఒకరు. ఆయన రాత్రి రైలు దిగి స్టేషన్ లో గడిపినట్టు చెప్పాడు. ఈ పరిణామానికి అందరూ విస్తు పోయారు. తరువాత సిగ్గుపడ్డారు. ధనవంతుడు వచ్చి ఈశ్వర చంద్రునికి కాళ్లకుమొక్కి పూల దండ వేసాడు. అతడు ఈశ్వర చంద్రుడిని చూడటానికి వచ్చిన ఓ అభిమాని. ఈసారి ఇంకా ఆశ్చర్యపోయారు. గొప్పవారు ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటారు. అన్నీ ఉన్న విస్తరాకులా. ఆ సభలో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు సాగరుడు.
నిరాడంబరత ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి