ఉదయం పాల ప్యాకెట్ కోసం డబ్బులు ఇద్దామని చొక్కా జేబులో చెయ్యి పెట్టగానే ఖాళీగా ఉంది.
ఒక్కసారిగా గుండెఝల్లుమంది సావిత్రి కి.
ఏమండీ జేబులో డబ్బు తీసి ఎక్కడైనా పెట్టారా అన్నది ఆత్రంగా.
అదేమిటి నిన్న రాత్రి జేబు లో పెట్టు పెట్టాను తీసి జాగ్రత్త చేయమని నీకే చెప్పాను బీరువాలో పెట్టమని నిదానంగా చూడు ఎక్కడ ఉన్నాయో సరిగ్గా చూసావా అన్నాడు మాధవరావు.
కావాలంటే మీరే చూడండి అసలు ఇంటికి తెచ్చారా లేదా అన్నది.
నేనేమన్నా నా చిన్నపిల్లాడిని అనుకున్నావా డబ్బులు పారేసుకుని రావటానికి పిల్లలు ఏమైనా నా పేరే మో అడిగి చూడమన్నాడు.
అంత డబ్బు పాలెం చేసుకుంటా రంది. మరి అయితే ఆ డబ్బు ఏమైనట్లు 10000 ఇంటి గల ఆయన అద్దె కోసం వస్తే ఏం సమాధానం చెప్పాలి ఇంట్లోకి పరాయివాళ్ళు ఎవరు రాలేదు ఆ డబ్బు ఎలా పోయినట్లు ఆలోచించాడు మాధవరావు.
కూతురు ని అడిగితే నాకు తెలియదంది.
కొడుకు ఇంత పొద్దున్నే ఇంట్లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లి ఉంటాడు ప్రైవేట్ క్లాస్ ఉన్నాయని వెళ్లి ఉంటాడు.
అయినా వాడు అలాంటి పని చేయడు అడగకుండా 10000 తీసి ఏం చేసుకుంటాడు ఇంటికి వచ్చాక అడిగి చూద్దాం అనుకున్నారు.
సావిత్రికి కాళ్ళు చేతులు ఆడటం లేదు జేబులో డబ్బులు ఎలా ఎలా మాయం అవుతాయి విజయ్ అలాంటి పని చేస్తాడు అంటే నమ్మకం కలగటం లేదు.
సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక విజయ్ ని డబ్బు సంగతి అడిగింది సావిత్రి.
నాకేమీ తెలియదు అన్నాడు.
ఇంతకీ ఆ డబ్బు ఏమైనట్లు.
ఎవరికి అంతుచిక్కడం లేదు.
విజయ్ కి మనసులో భయంగా ఉంది .
తండ్రి ఎదుట పడాలంటే ముఖం చెల్లడం లేదు. సాయంత్రం గర్ల్ ఫ్రెండ్ కి పుట్టినరోజు నాడు ఆ డబ్బుతో గోల్డ్ రింగు కొని బహుమతిగా ఇచ్చాడు.
ప్రవళిను ప్రేమించాడు ఆమెను సరదాలు సినిమాలు షికార్లకు తీసుకు వెళ్లడం లేదని అలిగింది ఈమధ్య మాట్లాడటం కూడా మానేసింది.
ప్రవళిక ప్రేమ కోసం విజయ్ ఆమె మెప్పు పొందాలని తండ్రీ జేబులో డబ్బు దొంగతనం చేసి ఉంగరం కొనిచ్చాడు.
అప్పట్నుంచి ప్రవళిక విజయ్ తో స్నేహంగా తిరుగుతున్నది.
గర్ల్ ఫ్రెండ్ కోసం తప్పు చేశాడు విజయ్.
అమ్మాయిలను ఆకర్షించాలంటే డబ్బు ఉండాలి సినిమాలకి రెస్టారెంట్ కి తిప్పాలి అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్ లు కొనివ్వాలి లేకపోతే వాళ్ళు ప్రేమను అంగీకరించదు బర్తడే రోజు ఉంగరం ప్రజెంట్ చేశాడని మురిసిపోయింది ప్రవళిక.
తండ్రికి విజయ్ మీదనే అనుమానంగా ఉంది నిజం చెప్పమని నిలదీశాడు.
విజయ్ చేసిన తప్పు ఒప్పుకోలేదు.
ఇంట్లో అందరూ తనని దొంగ లాగా చూస్తున్నారు.
ఆ చూపులు భరించటం కన్నా నిజం చెప్పడం మంచిది అనుకున్నాడు.
అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదు కంటిమీద రావడం లేదు.
మాధవరావు మెల్లగా వచ్చి కొడుకు గదిలో చూశాడు.
నిద్రపోకుండా మెలకువ గా ఉన్నాడు.
ఏమిటి ఇంకా పడుకోలేదా అన్నాడు మాధవరావు.
ఇప్పటికైనా నా నిజం చెప్పు ఆ డబ్బు తీసింది నువ్వే కదా అన్నాడు.
తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేదు విజయ్ కి.
నువ్వు నిజం చెప్పకపోతే పక్క ఊర్లో అంజనం వేసే రుద్రయ్య ఉన్నాడట.
అక్కడికి వెళ్లి ఈ విషయం చెప్తాను అంజనం వేసి చూస్తే ఎవరు తీసింది తెలిసిపోతుంది రేపే కనుక్కుంటాను అన్నాడు మాధవరావు.
విజయ్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నాన్న మా ఊరు వెళ్లి అంజనం వేస్తే నిజం తెలిసిపోతుంది దొంగ అని రుజువైన క ఏ ముఖం పెట్టుకుని ఇంట్లో ఉండగలను బయట తలెత్తుకొని తిరగలేను.
నిజం చెప్పేస్తే మంచిది అనుకున్నాడు.
తండ్రి రెండు కాళ్ళు పట్టుకున్నాడు నాన్న నన్ను క్షమిస్తావు కదూ ఆ డబ్బు నేనే తీసాను.
అంత డబ్బు నీకేం అవసరం వచ్చింది ఏదైనా నా ఉంటే నాతో చెబితే ఇచ్చే వాడిని కదా అన్నాడు.
ప్రేమించిన అమ్మాయి కోసం డబ్బు కావాలని ఎలా అడగను.
కాలేజీలో నా క్లాస్ మేట్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
ఈ ఒక్కసారికి క్షమించు నాన్న ఇంకెప్పుడు మిమ్మల్ని అడగకుండా డబ్బు దొంగతనం చేయను అన్నాడు బాధ గా.
అమ్మాయిలు డబ్బు చూసి ప్రేమించరు మనసు చూస్తారు అంతేగాని నువ్వు ఇచ్చే బహుమతి కోసం ఆశపడే వాళ్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదో ఆలోచించావా అన్నాడు.
తండ్రి మాటలు వాస్తవం కల్పించింది ప్రవళిక తనమీద ప్రేమ లేకపోయినా తనిచ్చే కానుకల కోసం ఆశ పడుతుంది అలా అంటే అమ్మాయి కోసం తను తప్పు చేశాడు ఈ వాస్తవాన్ని గ్రహించాడు.
మనసుని మనసుతోనే తెలుసుకోవాలి డబ్బుతో కాదు.
విజయ్ గర్ల్ ఫ్రెండ్ కోసం పరుగులు తీయడం మానేశాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి