నిజాయితీ(బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
బడిలో పండుగ వచ్చింది
ఆటల పోటీ పెట్టారు
ఆటల కొరకు వస్తుంటే
పైసల పర్స్ దొరికింది

గబగబ బాబి వెళ్లాడు 
మాస్టర్ గారికి ఇచ్చాడు
పర్సులో పేరు చూశారు
వారిని పిలిచి ఇచ్చారు

పిల్లలు ఆటలు ఆడారు
ఓటమి గెలుపు చెప్పారు
గెలిచిన వారిని పిలిచారు
కానుకలు వారికి ఇచ్చారు

బాబి ని కూడా పిలిచారు
మంచి కానుక ఇచ్చారు
వాని నిజాయితి చెప్పుతూ
ఎంతో మెచ్చుకున్నారు

ఇచ్చిన కానుక తెచ్చాడు
గోడకు దాన్ని వేశాడు
గణ గణ గంటలు మ్రోగింది
బాబీ చూసి మురిసాడు