కరుణామయి*(గేయకథ):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 1)
యుగోస్లోవియా దేశపు
స్కోపీజీ గ్రామములో
పాఠశాల ఒకటి ఉండె
విద్యాబుద్ధులు నేర్పను!
2)
ప్రతిరోజు ఓ బాలిక
అందరికన్నా ముందే
పాఠశాలలోన ఉండు
చక్కగాను చదువుచుండు!
3)
ఒకరోజున ఆ బాలిక
సమయానికి రాలేదూ
ఏమయిందో ఏమో అని
గాభరపడి చూచిరంత!
4)
కొంత తడువు గడిచినాక
అరుగుదెంచి బాలికపుడు
తరగతిగది తలుపుకడను
ఒదిగి ఉండె అనుమతికై!!
(సశేషం)

కామెంట్‌లు