పిల్లి ( బాల గేయం) :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
పిల్ల మెల్లగా వచ్చింది 
పాల గిన్నెకై చూసింది 
ఎలుక పరుగులు తీసింది
వెంబడించి పట్టింది.

పిల్లల పెద్దలు చూసారు
మ్యావ్ మ్యావని పిలిచారు
గిన్నెలొ పాలు పోశారు
పిల్లిని పెంచుదమన్నారు

పిల్ల

ల తోనే ఆటలు
తోకతోనే  డాన్సులు
గోడలపైన నిద్రలు
చేసెను ఎన్నో మేలులు.
కామెంట్‌లు