తెలుగేతర భాషల తేటదనము చూపెను
దువ్వూరి పేరునను దుమ్ముదులిపి కవనము
కవివిమర్శ కులుగా కలమును కదిలిoచెను
జలధి యంతరంగము జాను తెల్గు పదములు
సూదంటు రాయివలె సూటిగాను మాటలు
బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిదుడు
ఆధునిక పురాతన అక్షరాల తాపసి
పారశీక రుబాయీ పరవశమె కలిగించె
పానశాల వాకిట పలుకవిత లుదయించె
నలజారమ్మ చరిత నాణ్యత గల రచనగ
రైతుబిడ్డ పిడికిలి రైతుకవిగ నిలిపెను
భరతమాత విముక్తి భావికొరకు తపించి
నవయుగ వైతాళిక నాయక కవితానయె
పుట్టుకతో కాదుగ పుణ్య కృషీవలునిగ
నెల్లూరు సీమలో నేటికి కవి కోకిల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి