రామో విగ్రహవాన్ ధర్మః:-డా.రామక‌ కృష్ణమూర్తి-బోయినపల్లి, సికింద్రాబాద్.

 సర్వగుణాలకు,ధర్మాలకు
శ్రీరాముడే చిరునామా
తల్లిదండ్రుల మీద అపారమైన భక్తి
సోదరులపై అవ్యాజ్యమైన అనురాగం
సహధర్మచారిణిపై అమేయమైన ప్రేమ
ప్రజలపట్ల బాధ్యత
కర్తవ్యం పట్ల నిబద్ధత
పాలనపట్ల అంకితభావం
గురువుల యందు శ్రద్ధ
భక్తుల యందు కరుణ
దాసుల పట్ల వాత్సల్యం
శత్రువులపై వీరత్వం
ధర్మాచరణయందు అనురక్తి
జ్ఞానమునందు అమితాసక్తి
యజ్ఞయాగాది క్రతువుల యందు విశ్వాసము
కష్టసుఖాల్లో సమభావన
రామరాజ్యమనే కీర్తిప్రతిష్టలు
అందుకే రాముడే మానవాళికి ఆదర్శం.
కామెంట్‌లు