ప్రేమకు ప్రతిరూపం
అనురాగానికి నిదర్శనం
ఆత్మీయతకు నిర్వచనం
ఆడజన్మకు నిండుదనం
ఇలలో వెలసిన దైవత్వం
గుండె నిండా ప్రేమతత్వం
ఆపేక్ష నిండిన అమృతహస్తం
అడగందే ఆకలితీర్చే గొప్పదనం
తొలి అడుగులు వేయిస్తూ
తప్పటడుగులు సరిచేస్తూ
తప్పొప్పులు తెలుపుతూ
మార్గాన్ని నిర్దేశిస్తూ
చేసే అమ్మ పయనం
బిడ్డలకు విజయ సోపానం
ప్రతి ఒక్కరి తొలి గురువువు
జోలపాటలు వినిపించే కోయిలవు
గోరుముద్దలు తినిపించే అమ్మవు
దివి నుంచి భువికి వచ్చిన దేవతవు
తీర్చలేరు ఎవ్వరూ నీ రుణం
అమ్మా అందుకో మా వందనం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి