రా తమ్ముడు పోదాం బడికి ఆ..ఆ..ఆ
పిలుస్తోంది రారమ్మని అందరినీ ఓ..ఓ..ఓ.//2//
గుణగణ బడిగంట మోగిందంట
భయబ్రాంతులు లేనేలేవంట
బడిలోని చదువులు బాగుగా
మనకోసం పంతుళ్ళుచెప్తారుగా
ఆటపాటలతో ఆడుతు పాడుతు చదివేద్దాం..//రా తమ్ముడు//
శానిటైజర్ తప్పక రాసుకొనీ
మూతికి మాస్కు పెట్టుకొనీ
ఆన్లైన్ బోధనకు స్వస్తి పలికీ
ప్రత్యక్ష పాఠాలకు స్వాగతం పలికీ
పుస్తకాల సంచితో చకచక పోదాం బడికి..//రాతమ్ముడు//
పచ్చని ప్రకృతి ఒడిలోనా
ప్రియమైన గురువులతోనా
జ్ఞానం పెంచుకుందామురా
మనభవిత దిద్దుకుందామురా
అజ్ఞానం తొలగి విజ్ఞానం సొంతమౌను కదా..!//రాతమ్ముడు//
మధ్యలో తగు విశ్రాంతీ
భౌతిక దూరాలు కడు శాంతీ
కంటిచూపి పలకరింపులూ
మాస్కు తీస్తే మనకు ముప్పులూ
బరోసానిచ్చే బడులూ రావాలీ అందరూ..//రా తమ్ముడు//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి