అద్భుత "నిర్ణయ "0:- అచ్యుతుని రాజశ్రీ
 ఈ అమ్మాయి పేరు  నిర్ణయ బొట్లగుంట 9వ తరగతి   మిరు ఇంటర్నేషనల్ స్కూల్  చందానగర్ లో చదువుతున్న ది.  అమ్మ..స్రవంతి. నాన్న..కృష్ణ కిషోర్. ఇద్దరు  సాఫ్ట్వేర్.  యు.ఎస్.లో పుట్టి  5వక్లాస్ దాకా అక్కడే చదివింది.కానీ తమకుటుంబం తమ అమ్మమ్మ  బామ్మ  తాత లు కావాలి అనేఉద్దేశంతో కుటుంబం శాశ్వతం గా హైదరాబాద్ చేరింది. ఇక్కడ 6వక్లాస్ లో చేరింది. యు.ఎస్.లో శాంటాక్లారా లో ఐసన్ హోవర్ ఎలిమెంటరీ స్కూల్ లో చదివింది.అక్కడ అంతా గవర్నమెంట్ బడులు.పాఠ్యపుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. ఏడాది చివర నీట్ గా వాటిని ఇచ్చేయాలి.ఏడాది చివర ఒకేఒక్క ఫైనల్ పరీక్ష.వర్క్ షీట్  స్లిప్ టెస్ట్ పెడతారు రోజు. ప్రోగ్రెస్ కార్డ్  మార్కులు పైకి చెప్పరు.
ఈమె శని ఆదివారంనాడు ఆర్ట్  పెయింటింగ్ క్లాసులు  సంగీతం డాన్సు  తెలుగు క్లాసులకు వెళ్ళి అవి నేర్చుకున్న ది.సంగీతం  3ఏళ్ళు  భరతనాట్యం  1ఏడాది నేర్చుకుని  ఇండియా  వచ్చేయటంతో చదువు మీదే దృష్టి పెడుతోంది. ఈస్కూల్ లో ఇంగ్లీష్  ఫస్ట్ లాంగ్వేజ్  తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి  సమస్య లేదు. యుకెలెలె అనే వాయిద్యం ని స్వంతం గా యూ ట్యూబ్ లో చూసి  నేర్చుకుంటున్నది. ఇక అమెరికా లో చదువు కన్నా  ప్రాజెక్ట్ వర్క్   వర్క్ షీట్ తో ఏడాది పొడుగుతా  పిల్లలు నేర్చుకుంటారు.ఫైనల్ గా పరీక్ష పెడతారు. క్లాసు లో 30మంది కిమించి పిల్లలు ఉండరు. ప్రొజెక్టరు చూపుతూ పాఠం వివరిస్తారు. తనకు నచ్చిన  స్కూల్ వర్క్  చపాతీపిండితో  కాలిఫోర్నియా ని తయారు చేయటం అని చెప్పింది. 9నుంచి 3దాకానే స్కూల్ కాబట్టి  హోంవర్క్  పెద్ద ఉండకపోటంతో బడి అంటే సరదాగా గడిపాను అని చెప్పిన నిర్ణయ ఆర్కిటెక్ట్ కావాలి అనుకుంటున్నది.చక్కగా తెలుగు లో భేషజం లేకుండా అచ్చమైన తెలుగు పిల్ల  నిర్ణయ తను అనుకున్నది సాధించగలదు.అలా ఆశిద్దాం.