అమ్మ :- శ్రీ నిత్య.- 9వ , తరగతి

 అమ్మ కనిపించే  దైవము
 అమ్మ జ్ఞాపకాలు  మాటల్లో   చెప్పలేము
 అమ్మలేని లోకం ఊహించలేము
 అమ్మ ప్రేమ విలువ అమూల్యం
         దైవం ప్రతిరూపం అమ్మ
        ప్రేమకు ప్రతిరూపం అమ్మ 
     సహనానికి ప్రతిరూపం అమ్మ 
 ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం.
 తన కడుపులో నవమాసాలు మోసి 
 మన తప్పులను కడుపులో దాచుకొని
 ఇష్టాన్ని చూపుతుంది అమ్మ.
 మన భవిష్యత్తు కు ఆమె చేసే పూజలు ఏనలేనివి 
 మన ఆకలి తీర్చి, తన కళ్ళల్లో ఆనందాన్ని,
 మన సంతోషమే  తన సంతోషం.
 పసి మనసు ఆవేదనలు ఓదార్పు 
 అమ్మ ఋణం తీర్చుకోలేనిది .
 అమ్మలా ప్రేమను పంచలేము.
 తన  సహనమే  శ్రీరామరక్ష.
 అమ్మ ప్రేమ అనంతమైనది.
                  
           
కామెంట్‌లు