"చదువు విలువ"(మినీ కథ):-నెనావత్ మౌనిక 10వ తరగతిZPHS నేరెళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్ల7013264464


  రాఘవాపురం అనే ఊర్లో మోహన్, లలిత అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు రవి అనే కొడుకు ఉన్నాడు. వీళ్లది చాలా పేద కుటుంబం. అయినా    చిన్నప్పటి నుంచి రవిని చాలా అల్లారుముద్దుగా పెంచారు. ఏది కావాలంటే అది కొనిచ్చేవారు. రవికి కష్టం విలువ తెలియకుండా పెంచారు. రవి బాగా చదువుకొని పెద్ద స్థాయిలో, ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాళ్ళు.

       కానీ రవికి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా బడికి వెళ్ళేవాడు కాదు.

చదువుకోకుండా బయట తిరగడం వల్ల పనికిరాకుండా పోయాడు. 

     తన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంత చెప్పినా, వినిపించుకోలేదు. తన తోటి స్నేహితులు బాగా చదువుకొని, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. ఒక రోజు రవి  ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి , సార్ నేను నా స్నేహితులు లాగా ఎందుకు ఎదగలేక పోయాను. అని, అడిగాడు రవి. రవి వాళ్ళ ఉపాధ్యాయులు చెప్పారు. ఎందుకంటే, మేము చెప్పినప్పుడు నువ్వు విని, బాగా చదివి, అర్థం చేసుకుని ఉంటే, మీ స్నేహితుల కంటే గొప్ప స్థాయిలో   ఉండేవాడివి.చెడు స్నేహితులతో అల్లరిగా తిరుగుతూ సమయం వృధా చేసుకున్నావ్ అని చెప్పారు. ఆ మాటలు విన్న రవి ఎంతో బాధ  పడ్డాడు. మా అమ్మ నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు.  కానీ నేను వాళ్లకు ఏమి చేయలేక పోయాను అని, రోజు బాధపడుతూ సరిగ్గా తినేవాడు కాదు. ఇక చేసేదేమీ లేదని, కొన్ని రోజులకు రవి తల్లిదండ్రులు

చెప్పినట్లు వింటూ కూలీ పనులు చరసుకుంటూ ఉండేవాడు. 

    పెళ్లి వయసు రాగానే తనకు పెళ్లి కూడా చేశారు. ఒక సంవత్సరం అయ్యాక రవికి ఒక ఆడపిల్ల పుట్టింది. తనకి సరస్వతి అని పేరు పెట్టారు. రవి తన కూతురిని బాగా చదివించాలని నిర్ణయించుకొని, కష్టపడి చదివించాడు. రోజు తన కూతురికి నైతిక విలువలు, ఉపాధ్యాయుల తల్లిదండ్రుల, విలువలు చెబుతూ పెంచాడు. సరస్వతి విని అర్థం చేసుకొని, బాగా చదువుకునేది. ఒక రోజు రవి తన దగ్గరకు వెళ్లి,అమ్మ సరస్వతి "  ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలు కష్ట పడకూడదు అని అనుకుంటారు. కానీ కష్టం విలువ తెలుసుకో కూడదు అని అనుకోరు"అని చెప్పాడు. నా తల్లిదండ్రులు నన్ను కష్టం విలువ తెలియకుండా పెంచారు. కాబట్టి నేను ఇలా కూలిపని చేసుకుంటూ బతుకుతున్నాను. నువ్వు మాత్రం నాలా కాకూడదు.  బాగా చదువుకోవాలి.  అన్నాడు రవి. సరస్వతి అలాగే నాన్నా అన్నది. రవి తన కూతురు ని సరస్వతి నీ లక్ష్యం ఏంటమ్మా అని, అడిగాడు. దానికి సరస్వతి కలెక్టర్ నాన్న అన్నది. అలాగా మంచిది తల్లి నువ్వు బాగా చదువుకొని నీ గమ్యాన్ని చేరుకోవాలి, అన్నాడు రవి.

     కొన్ని సంవత్సరాల తరువాత సరస్వతి కలెక్టర్ అయింది. ఆ విషయం ముందు తన తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని సంతోష పరిచింది. అప్పుడు సరస్వతి వాళ్ళ నాన్న, ఇలా అన్నాడు. "తల్లిదండ్రులకు నిజమైన సంతోషం పిల్లలు పుట్టినప్పుడు కాదు.  వాళ్లు పెద్ద స్థాయిలో ఉండి ప్రజలు వాళ్ళని మెచ్చుకుంటున్న అప్పుడు కలుగుతుంది" అన్నాడు రవి. ఆ తరువాత నుంచి వాళ్ళ జీవితం ఎంతో సాఫీగా కొనసాగుతుంది. సరస్వతి తన కర్తవ్యాలను నిజాయితీగా నిర్వహిస్తుంది.  "చదువు విలువ తెలుసుకుంటే ఏ సమస్య అయిన ధైర్యంగా  ఎదుర్కోవచ్చు"


కామెంట్‌లు