నా నీడవి నువ్వే..నను వీడవనుకున్నా..
చీకటిలోకూడా తోడై ఉంటావనుకున్నా..
వెలుతురు పడని మసకలలో,
వేకువ తెలియని మెలకువలో మిగిలా నేను ఒంటరినై...
దారీ,తీరు తెలియక ఆహ్వానిస్తున్న బహుదూరపు బాటసారినై..
ఎదురుచూపుల పలకరింపులు లేక ఆస్వాదిస్తున్న ఏకాకినై..
చెదరని నవ్వుల చైతన్యంలో కరగని
కన్నీరుల నిట్టూర్పులని జతచేసుకుంటున్న...
ఊపిరికి ఊహల చమురుని కలుపుకుని,
ఆరని నిప్పులకొలిమిలా,నన్ను నేను దహించుకుంటున్న..
దహించుకుపోతున్న నన్ను నేను
కరిగే కన్నీరుకి చలిమంటనవుతున్న..
...నా అంతర్గతం
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి