క్వారన్టైనైతే మేలు
కరోనా నుండి కొలు
లాక్డౌన్ నియమాలు
పాటించకుంటే జైలు
ఓ కరోనా మహమ్మారి
ప్రజల మస్తకం మారి
భగవంతుడితో కోరి
ఓడిస్తాము నిన్ను మరి
మహమ్మారి మహాశక్తి
పొందాలి మనం ముక్తి
మనమే చేయాలి భక్తి
ఇదే మానవుల సూక్తి
వ్యాక్సినేషన్ అవసరము
మహమ్మారి అంతము
కలకాలము సొంతము
అరికట్టుతే కరోనము
ఓహో విజ్ఞనం పెంచు
ఆజ్ఞనము తొలిగించు
వైద్యులను పూజించు
విజయాన్ని సాధించు
వైద్యులలో హడహుడి
మహమ్మారిపైనే దాడి
మేధావులము కూడి
అరికడ్తామ్ మందు వాడి
వ్యాక్సినొస్తేనే ముద్దు
మహమ్మారి కాటోద్దు
కలమును పట్టి దిద్దు
వీరుల సాధన హద్దు
మహమ్మారి జాగ్రత
తీసుకుంటే అద్భుత
కరోనా కాటు భద్రత
పాటిస్తే మన భవిత
కోవిడ్ రికార్డు మోత
జనుల జీవన కూత
అక్కడున్నావ్ దాత
రక్షించాలి మా రాత
దేవునికి దండంపెట్టు
వైద్యులకు బొట్టుపెట్టు
మహమ్మారిలకు ఒట్టు
పెట్టి నువ్వు బెదరగొట్టు


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి