స్మైలింగ్ మిస్సైల్ మాన్ ..మిస్ యు(శీర్షిక): ఇమ్మడి రాంబాబు15-128 మైన్ రోడ్, తొర్రూరుమహబూబాబాద్ జిల్లాచరవాణి: 9866660531

 

కలాంజీ అందుకో మా సలాం
రామేశ్వర పేపర్బాయ్ గా మీ ప్రస్థానం
దేశ సార్వభౌమత్వాన్ని నేతగా మీ ఆస్థానం
శతాబ్దిలో నలు దశాబ్దాలు
ఆత్మీయత అభిమానం.. మీకు అందించెను
సగౌరవ డాక్టరేట్లు ..సన్మాన అభిమానాలు.
భరతజాతి కొలనులో రామేశ్వరంన విరబూసిన  వికసించిన పద్మభూషణ  వైమానికోత్తమా!
భరతమాత సిగలో మెరిసే భారతరత్న మా!
నింగికెగసిన నిరంతర కీర్తిపతాకం వీర సావర్కరమా!
మీ ఉద్బోధ కలలకు.. ఆకారం సాకారంగా
నేటి యువతకు కలాంజీ అందించెను భవితవ్యం
మా మాటలకందని మా ఊసులను
ఈసురో(ఇస్రో)అనిపించిన అణ్వస్త్ర పితామహ!
అవనిలో అణు వణువు అర్పిస్తున్నారు
కన్నీటి భాష్పఆంజలి.. కలాంజి అందుకో మా సలాం
అబ్దుల్ జి అకాల మరణం నా మది లో కలవరం
ఆ సేతు హిమాచల జనం అర్పిస్తున్నారు
మీకు జోహార్లు..అశ్రు నీరాజనాలు.
మా కలలకు కలాలకు వన్నె తెచ్చే.. మా ఆశయసిద్ధి కై
భువి నుండి దివికేగి.. ధ్రువ తార వై
ఆశీస్సులు అందించు కలాంజి..
మిస్సైల్ మాన్ స్మైలింగ్ మాన్ వి మిస్ యు
(కలాంజీ మరణవార్త విన్న వెంటనే రాసిన కవిత అక్షరాంజలి)