పల్లవి:-
తెలుగుబడి ఇష్టపడి తెలుగుబడి శ్రద్ధపడి
చదువుతాము మేమందరం చదువుతాము మేమందరం ""2""
తెలుగింటి పిల్లల0 మేమందరం తెలుగింటి పిల్లలం ""2""పల్లవి""
అందమైన అక్షరాలు కో"దిద్దుకుంటూ
సక్కనైన పదాలు కో""నేర్చుకుంటూ..."2""
ఆడుకుంటూ పాడుకుంటూ పరవశాన పాఠశాలలో..
చదువుకుంటాము మేమందరం హే హే ..మేమందరం..""తెలుగింటి""పల్లవి""
చరణం:-1
ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తాం మేమందరం
చిలిపి చిలిపి చేష్టలతో నవ్విస్తాం మేమందరం
ఏ భేదమేమిలేని పిల్లలం ఒకే కాంతి కమలల0 ""2""కో
చిరువెలుగుల దివ్వెలం చిన్నారులం
కలిసి మెలసి ఉంటాము మాబడిలో
తెలిసి నడిచి పోతాము మా దారిలో..
నాడు నేడు మాకు అమ్మఒడి మాబడి ..""2"కో
మరచిపోములే విడిచి పోములే ఎన్నటికీ మాబడి ""తెలుగింటి""పల్లవి""
చరణం:-2
తొలి అక్షరగీత అలాపనా.. చేస్తాము మేమందరం
చదువులమ్మకి శుభోదయానా
ఒకే గళంతో ఒకే ధేయంతో మేమందరం మేమందరం మాబడిలో..
ప్రాంతీయభేధాలు మాకులేవనీ.. కులమతాతేడాలు లేవని
చాటిచెప్పగా ప్రతిరోజు ఈ తీరుగా...
చేస్తాము అలాపనా.. చేస్తాము అలాపనా.. మేమందరం మేమందరం""తెలుగింటి""2 పల్లవి""
చరణం :-3
గురువే దైవమని పరబ్రహ్మస్వ రూపమని
చేస్తాము వందనం అభివందనం రోజు పాదాభివందనం " 2""కో మేమందరం
తరగతులకు సడలిపోయినా క్రమమూ ...తప్పములే
గృహాలకు మరలిపోయినా.. సన్మార్గము మరచిపోములే..2"
ఆప్యాయతకే మేమందరం హారతి పడతాం
అనురాగాలకు మేమందరం ఆనవాలుగా నిల్చుతాం ""తెలుగింటి""పల్లవి""
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి