దూరం :---రాజేందర్ జింబో (2.6.2021)

చాలా విషయాలతో దూరమై పొతున్నాం . 
ఎన్నోసార్లు చూస్తూ చదువుకునే ఉత్తరాలు అదృశ్యమైనాయి. 

చేతిరాత అదృశ్యమై పోయింది. 
ఉత్తరాలని చూస్తే ఆ మనిషిని చూసినట్టు అనిపించేది 
ఇప్పుడు అన్ని రాతలు ఒక్కటే 

రోజురోజుకీ 
దగ్గర అయినట్టుగా అన్పిస్తుంది.
కానీ -
దూరాలు పెరుగుతూనే వున్నాయి 

ఈ సాంకేతికత లో 
స్పర్శ లేదేమో 
వుండదేమో -

కాలం ఎన్ని మార్పులను తెస్తుంది ...?
కాదనలేం !! 
వద్దనలేం !!!
కామెంట్‌లు