మత్తేభము:
*చనువారింగని యేడ్చువారు జముడా! | సత్యంబుగా వత్తుమే*
*మనుమానంబిక లేదు నమ్ముమని తా | రావేళ నారేవునన్*
*మునుగంబోవుచు బాసచేయుట సుమీ | ముమ్మాటికిం జూడగా*
*చెనటుల్గానరు దీని భావమిదివో | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
చనిపోయిన వారిని చూచి ఏడుస్తూ మేము కూడా ఈతని వెంట వచ్చేస్తాము తీసుకు వెళ్ళు దేవుడా అని శవ సంస్కారాలు చేసేటప్పుడు, నదిలో నిలబడితిలోదకాలు, ధర్మోదకాలు వదిలేటప్పడు అంటుంటారు. కానీ,ఇలా మాట్లాడటం, అలోచిచడంలో తెలివి తక్కువ తనం తప్ప వేరే ఏమీ లేదు అని మనిషులు గుర్తించలేరు కదా......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఓ శ్మశాన బైరాగీ, కాలకాలకా! ఇదే కదా "శ్మశాన వైరాగ్యం! ప్రసూతి వైరాగ్యం" అంటే. మన సంబంధీకులు మరణించిన ప్రతీసారీ, మనంకూడా చనిపోదాము అనుకుంటాము. కానీ సమయము కానిదే, రానిదే మరణం సంభవించదని, రాదని మనకు తెలుసు. అయినా, మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు. కానీ, ఆ కాలపురుషుడు మనకు "మరపు" అనే గొప్ప వరం యిచ్చాడు కదా! అందువల్ల మరుక్షణం లోనే "రేపు ఏమిటి చేయడం" అనీ, ఇప్పుడు తిన వచ్చా, ఇంటికి చేరి తినాలా అనీ. మళ్ళీ ఈ జీవన చట్రం లో తిరుగాడుతూ జీవించడానికి సిద్ధమై పోతాము. కరుణామూర్తీ, ఈ తిరుగలి చట్రం లోనుంచి మమ్మల్ని ఆవల పడవైచి నీ సాక్షాత్కారం ఇవ్వు స్వామీ, పన్నగేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి