మత్తేభము:
*మును నేపుట్టిన పుట్టులెన్నిగలవో | మోహంబుచే నందు చే*
*సిన కర్మంబుల ప్రోవు లెన్నిగలవో | చింతించినంగాని, యీ*
*జననంబేయని యున్నవాడ నిదియే | చాలింపవే నిన్ను గొ*
*ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఈ జన్మలో పట్టడానికి ముందు ఎన్ని సార్లు పుట్టానో, ప్రేమ ఆవేశంతో ఆ జన్మలలో ఎన్నెన్ని పనుకు చేసి ఎంత పాప పుణ్యాలు మూట కట్టుకున్నానో కదా. ఇక ఈ పుట్టకలు చాలు స్వామీ. ఈ జన్మలో నీ పూజ చేసాను కదా, అందుకని నా మీద దయవుంచి ఈ పుట్టకనే ఆఖరి పుట్టుక చేసి, మోక్షము ఇయ్యవయ్యా త్రైలోక సంచారా ......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*శివా! "పునరపి జననం పునరపి మరణం" అని ఈ చావు పుట్టుకల చట్రం లో ఎన్ని మార్లు జన్మించానో, ఇప్పటికి. ఆయా జన్మలలో ఎన్ని అకృత్యాలు చేసి, సంచిత పాపౌఘుడిని అయ్యానో! కానీ మనస్ఫూర్తిగా నీ పేరు తలచతినే మోక్షము యిస్తాను అంటావు కదా! మరి నేను నీ పూజ చేస్తున్నాను. నా గత జన్మలలో, ఈ జన్మలో నేను సంపాదించుకున్న పాపురాశిని కరగించి వేసి నాకు మోక్షము ప్రసాదించు స్వామీ! నశ్యంకరా| నాకు, ఇంకా జన్మలు ఎత్తి, కర్మలు చేయాలనే కోరిక లేదు. "దాచుకో! నీ పాదాలకు తగ నే జేసిన పూజలివి", "నీవు తక్క హితః పరంబెరుగ"*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి