*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౪౮ - 48)

 మత్తేభము:
*మలభూయిష్ట మనోజధామము సుషు | మ్నా ద్వారమో, యారకుం*
*డలియో పాదకరాక్షీయుగ్మములు ష | ట్కంజంబులో, మోముదా*
*జలంబోనిటలంబు చంద్రకళయో | సంగంబు యోగంబో గా*
*సిలిసేవింతురు కాంతలను భువిజనుల్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఈ భూమి మీద పురుషులు స్త్రీల తో సంయోగ విషయములో తమ శక్తి సామర్ధ్యాలు ఉపయోగించి పనిచేస్తారు.  స్త్రీ యొక్క రహస్య ద్వారము  సుషుమ్న నాడికి ప్రవేసద్వారమూ కాదు. ఆమె కళ్ళు కాళ్ళూ, చేతులు ఆరు పద్ంఉలూ కావు.  ఆమె ముఖము అష్టదళ పద్మమూ కాదు.  ఆమెతో సంగమించడం యోగమూ కాదు. ఇవన్నీ తెలిసి కూడా  స్త్రీ ని సేవించడానికి పురుషులు వురకులు వేస్తూ వుంటారు......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరాత్పరుడు తను మొదలు పెట్టిన సృష్టి కార్యక్రమం ఆగకుండా వుండడానికి, ఈ భూమి మీద స్త్రీ, పురుషులను ఉద్దేశించాడు.  ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయడానికి చేదోడుగా వుండాలని గృహస్తాశ్రమంలో స్త్రీ ఆవశ్యకతను కల్పించారు. ఇంత గౌరవ ప్రదమైన స్తానం కల స్త్రీని, ఒక విలాస వస్తువు గానే చూస్తున్నారు ఈ భూమి మీద పురుషులు.  పురుషార్ధ సాధనలో భాగం అవ్వవలసిన స్త్రీ, ఆమెతోనే మోక్షం అనే స్తాయికి తెచ్చుకున్నాడు, ఇక్కడ మనిషి.  స్త్రీ ని పురుషుడు తనతో సమానంగా భావించి గౌరవించి కైవల్య సాధనకై పరితపించాలి అని భావం*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు